Home » IMD
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడ్రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం, పడమటి గాలుల వేగం కారణంగా రాష్ట్రంలో మంగళవారం నుండి ఆరు రోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. 16 నుండి 17 వరకు చెన్నై సహా ఆరుజిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా మరోసారి వర్షాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అల్ప పీడన ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వానలు (Rain Alert) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
కన్నియాకుమారి జిల్లాలో గురువారం రాత్రి నుంచి కుండపోతగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. కన్నియాకుమారిలోని మీనాక్షిపురం రోడ్డు, కోట్టార్ రోడ్డు, అసంబు రోడ్డు తదితర రహదారులలో మోకాలి లోతున నీరు ప్రవహించింది.
నగరంలో వాతావరణం చల్లబడింది. సోమవారం పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలకు జాతీయ విపత్తుల బృందం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ బృందం ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న క్రమంలో రానున్న నాలుగురోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, నీలగిరి జిల్లాలో ఈ నెల 14వ తేదీన భారీ వర్షం కురుస్తుందని వాతావారణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది.
భారత వాతావరణ శాఖ (IMD) వర్షాల గురించి కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో జూన్ 8 నుంచి 14 వరకూ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Rain Alert) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
రాష్ట్రంలో ఏడు రోజులు ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాష్ట్రంలో.. నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుండి వచ్చే ఆదివారం వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఆ శాఖ హెచ్చరించింది.