Home » IAS Officers
ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా శశాంక్ గోయల్‌ను బదిలీ చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేష్ కుమార్‌ను నియమించింది. ఆయనకు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) చీఫ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్-2024 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు మెరిశారు. చాడ నిఖిల్‌రెడ్డి, జి. ప్రశాంత్, చెరుకు అవినాశ్‌రెడ్డి టాప్ 50లో స్థానం పొందారు.
ఓ ఐఏఎస్ అధికారిపై శునకం దాడి చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తేనాంపేటలో జరిగింది. ఉదయం పూట వాకింగ్ కు వెళ్లిన ఆ ఐఏఎస్ అధికారిపై శునకం దాడి చేసింది. కాగా.. ఈ కుక్కను ఓ వ్యక్తి పెంచుకుంటున్నాడు. అతనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఓబుళాపురం మైనింగ్ కేసు నుంచి విముక్తి పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. ఈ కేసులో ఆమె పాత్రపై మరోసారి సమగ్ర విచారణ అవసరమని తేల్చిం ది.
Who is Ashok Khemka: ఇండియాలో అత్యధికంగా ట్రాన్స్‌ఫర్ అయిన ఐఏఎస్‌గా గుర్తింపు తెచ్చుకున్న 1991 బ్యాచ్ అధికారి అశోక్ ఖేమ్కా హర్యానా రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు.
తనకు తెలియకుండా, కనీస సమాచారం లేకుండా.. తన శాఖలో కీలకమైన ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంపై ఓ సీనియర్ మంత్రి షాక్‌కు గురయ్యారు.
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితాసభర్వాల్‌పై వేటు పడింది. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా.. మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహాలు చేస్తున్న ఆమెను ప్రభుత్వం పాత స్థానానికి బదిలీ చేసింది. ఆర్థిక సంఘం(ఫైనాన్స్ కమిషన్) సభ్య కార్యదర్శిగా నియమించింది.
ఈ గ్రామం చాలా స్పెషల్. ఎందుకంటే, ఈ గ్రామంలో 100 మందికి పైగా IAS లు ఉంటారు. అంతేకాకుండా, ప్రతి ఇంట్లో ఒక ప్రభుత్వ అధికారి ఉంటారు. ఇక్కడి విద్యార్థులు కూడా వెరీ టాలెంటెడ్. 7 మందిలో నలుగురు NEET, మిగిలిన ముగ్గురు JEE వంటి క్లిష్టమైన పరీక్షలలో సులభంగా ఉత్తీర్ణులవుతారు.
రాష్ట్రంలో మే నెల మొదటి వారంలో కలెక్టర్ల బదిలీలు జరగనున్నాయి. ఈమేరకు ప్రభుత్వం బదిలీలపై కసరత్తు మొదలు పెట్టింది. ఈసారి కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల(స్థానిక సంస్థలు)ను పెద్దసంఖ్యలో బదిలీ చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
విజన్-2047 లక్ష్యాలను సాధించేందుకు, స్వర్ణాంధ్ర స్థితిని పురస్కరించుకొని, ప్రభుత్వం మంగళ, బుధ వారాల్లో జిల్లా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో పీ4 అమలు, డిజిటల్ అడ్మినిస్ట్రేషన్, సంక్షేమ పథకాల అమలు వంటి ముఖ్య అంశాలు చర్చించబడతాయి.