Home » Home Minister Anitha
ఎన్డీఏ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని హోం మంత్రి అనిత అన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వెనుకబడిన జిల్లాలు కాదని.. వెనక ఉండి నడిపించే జిల్లాలని తెలిపారు.
జగన్ మోహన్ రెడ్డి హయాంలో పాయకరావుపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాయకరావుపేట నియోజకవర్గ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.5.46 కోట్లు కేటాయించి, పనులు చేపట్టామని పేర్కొన్నారు.
రోజు గంట పాటు సైకిల్ తొక్కడం వల్ల ఓవైపు ఆరోగ్యం, మరోవైపు పర్యావరణం బాగుపడతాయని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, నో వెహికల్ డే సందర్భంగా ఆమె విజయవాడలో తన నివాసం నుంచి ఆటోనగర్ ఫైర్ స్టేషన్ వరకు సైకిల్ తొక్కారు.
డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే.. జగన్ 9 నెలల తర్వాత విషప్రచారం మొదలుపెట్టారంటూ హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్డ కాల్చి ముఖాన వేస్తే తుడుచుకునే పరిస్థితుల్లో లేమని అన్నారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన కొనసాగుతోంది. సత్యవరం గ్రామానికి చేరుకున్న హోం మంత్రికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.
విశాఖపట్నంలో హోంగార్డు ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. హోం మంత్రి ప్రోత్సాహంతో మొదటి విడతగా 975 మంది హోంగార్డులకు ఆరోగ్య బీమా అందించనున్నారు.
క్రైస్తవ మత ప్రచారకుడు, నటుడు అభినయ్ దర్శన్ వ్యవహారంపై హోం మంత్రి అనిత స్పందించారు. అభినయ్ దర్శన్ వ్యవహారంలో విచారణ జరుగుతోందని అన్నారు.
భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు.శ్రీకాళహస్తిలో సోమవారం టూటౌన్ పోలీస్‌స్టేషన్ భవనాన్ని మంత్రి సత్యప్రసాద్‌తో కలిసి ఆమె ప్రారంభించారు.
ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడం కోసమే జైళ్లు అని హోంమంత్రి అనిత అన్నారు. ఏపీలో సంచలనమైన కేసులను త్వరితగతిన విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయన్నారు.
అగ్నిమాపక శాఖ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సచివాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫైర్‌స్టేషన్లు లేని 22 నియోజకవర్గాల పరిస్థితిపై అధికారులతో చర్చించారు.