• Home » HMDA

HMDA

జీహెచ్‌ఎంసీ  కమిషనర్‌గా  ఆమ్రపాలి

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పూర్తిస్థాయి కమిషనర్‌గా ఆమ్రపాలి కాట నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) జాయింట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

Hyderabad: పంద్రాగస్టుకైనా ఇవ్వలే!

Hyderabad: పంద్రాగస్టుకైనా ఇవ్వలే!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలిస్తుంటే.. హైదరాబాద్‌ మహా నగర అభివృద్ధి సంస్థ (Hyderabad Metropolitan Development Corporation)లోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నెల గడిచి 15 రోజులైనా వేతనాలు అందలేదు.

HMDA: హాట్ సీటుగా హెచ్ఎండీఏ.. ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, అర్బన్‌ ఫారెస్టు, ఇతర విభాగాల్లో ఖాళీలు

HMDA: హాట్ సీటుగా హెచ్ఎండీఏ.. ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, అర్బన్‌ ఫారెస్టు, ఇతర విభాగాల్లో ఖాళీలు

హెచ్‌ఎండీఏ(HMDA)లో ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, అర్బన్‌ ఫారెస్టు ఇతర విభాగాల్లో భారీగా ఖాళీలున్నాయి. ప్లానింగ్‌ విభాగం సీటులో కూర్చుంటే ఆదాయానికి మించి ఆస్తులను కూడగట్టుకోవచ్చనే ప్రచారం ఉన్నది.

Hyderabad: మెట్రో రైళ్లపై ఎల్అండ్‏టీ దృష్టి..

Hyderabad: మెట్రో రైళ్లపై ఎల్అండ్‏టీ దృష్టి..

నగరంలో ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు మొదలవుతున్న మెట్రో రైళ్లు రాత్రి 11.15 గంటల వరకు నడుస్తున్నాయి. కాగా, ప్రతీ సోమ, శుక్రవారాల్లో ఉదయం 5.30 గంటలకు ప్రారంభమై రాత్రి 12.45 గంటల వరకు తిరుగుతున్నాయి. ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, జేబీఎస్-ఎంజీబీఎస్‌, నాగోల్‌-రాయదుర్గం కారిడార్లలోని 57 స్టేషన్ల పరిధిలో రోజుకు 1028 మెట్రో ట్రిప్పులను నడిపిస్తున్నారు.

Hyderabad: హై.. హై.. ‘హైడ్రా’!

Hyderabad: హై.. హై.. ‘హైడ్రా’!

జీహెచ్‌ఎంసీతో పాటు ఔటర్‌ వరకు పరిధి.. దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్లు.. 27 మునిసిపాలిటీలు, 33 పంచాయతీలు..! స్వయంప్రతిపత్తితో విధి నిర్వహణతో.. హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా) పేరిట మహా నగరంలో కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

Hyderabad: మియాపూర్ వివాదాస్పద ల్యాండ్‌లో డ్రోన్‌తో గస్తీ కాస్తున్న పోలీసులు..

Hyderabad: మియాపూర్ వివాదాస్పద ల్యాండ్‌లో డ్రోన్‌తో గస్తీ కాస్తున్న పోలీసులు..

హైదరాబాద్: మియాపూర్ హెచ్ఎండిఏ వివాదాస్పద ల్యాండ్‌లో పోలీసులు డ్రోన్‌తో గస్తీ కాస్తున్నారు. ల్యాండ్ చుట్టూ పక్కల ఏవరైనా ఆందోళన కారులు ఉన్నారా? లేరా? అని తెలుసుకుంటున్నారు. మరోవైపు పోలీసుల పహారా కొనసాగుతోంది. ఎవరూ ల్యాండ్ వద్దకు రాకుండా ఉండేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.

Hyderabad: ఔటర్‌.. బంగారు బాతే!

Hyderabad: ఔటర్‌.. బంగారు బాతే!

ఔటర్‌ రింగ్‌ రోడ్డు.. ఆదాయ పరంగా బంగారు బాతు అన్నది స్పష్టమవుతోంది. ఔటర్‌పై రోజు రోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీతో ఆదాయం భారీగా పెరుగుతోంది. ప్రతి నెలా హెచ్‌ఎండీఏ అధికారులు ఊహించని స్థాయిలో రాబడి వస్తోంది.

Hyderabad: హెచ్‌ఎండీఏ అనుమతులన్నీ ఆన్‌లైన్‌లోనే..!

Hyderabad: హెచ్‌ఎండీఏ అనుమతులన్నీ ఆన్‌లైన్‌లోనే..!

బహుళ అంతస్తుల భవనాలు, గోడౌన్లు, పెట్రోల్‌ బంక్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీల నిర్మాణం, లేఅవుట్‌ ఏర్పాటు.. వీటీల్లో దేనికైనాసరే హెచ్‌ఎండీఏ ఇకపై ఆన్‌లైన్‌లోనే అనుమతులు జారీ చేయనుంది. కొన్ని అనుమతులు ఆన్‌లైన్‌లో మరికొన్ని అనుమతులు ఆఫ్‌లైన్‌లో జారీ చేసే గత విధానానికి పూర్తిగా స్వస్తి పలికింది.

CM Revanth Reddy: సార్‌.. సిబ్బంది కావాలి.

CM Revanth Reddy: సార్‌.. సిబ్బంది కావాలి.

పురపాలక శాఖ పరిధిలోని పలు విభాగాల్లో సిబ్బంది కొరత అధికంగా ఉంది. దీని వల్ల డిప్యుటేషన్లపై ఆధారపడి పనులు చేయాల్సిన పరిస్థితి. పురపాలక శాఖ సంచాలకుల పరిధి(సీడీఎంఏ), హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డు, మూసీ అభివృద్ధి మండలి, హెచ్‌ఎండీఏ, టౌన్‌ ప్లానింగ్‌, పబ్లిక్‌ హెల్త్‌, రెరా విభాగాల్లో సిబ్బంది కొరత ఉన్నట్లు ఆయా విభాగాల అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

TG News: అక్రమ నిర్మాణాలపై HMDA ఉక్కుపాదం.. భారీ భవనాల కూల్చివేత

TG News: అక్రమ నిర్మాణాలపై HMDA ఉక్కుపాదం.. భారీ భవనాల కూల్చివేత

నార్సింగి మున్సిపాల్టీలోని అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం మోపింది. కోకాపేట గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను హెచ్ఎండీఏ, మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా భవన యజమానులు జీ ప్లస్ 3 అనుమతులు తీసుకొని ఆరు అంతస్థులు నిర్మించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి