Home » Hindupur
మున్సిపల్ పీఠం అధిష్టించేందుకు టీడీపీకి లైన్ క్లియర్ అయ్యింది. వైసీపీకి చెందిన మునిసిపల్ చైర్‌పర్సన్ ఇంద్రజ టీడీపీలో చేరి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎక్కువమంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడంతో చైర్మన్ పీఠం సులువుగా టీడీపీ పరం కానుంది. 2021లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో..
రాజకీయాల్లో ఎప్పుడూ ప్రత్యేకత చాటుకునే బాలయ్య.. శుక్రవారం బస్సు నడిపి టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో కొత్త ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే బాలకృష్ణ (Nadamuri Balakrishna) ప్రారంభించారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి మంజులవాణి సిబ్బందికి సూచించారు. సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని గురువారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు.
మండలంలోని పలు అంగనవాడీ కేంద్రాలను సీడీపీఓ అనురాధ గురువారం తనిఖీ చేశారు. ఎగువ గంగంపల్లిలోని రెండు అంగనవాడీ కేంద్రాలు, ఎర్రయ్యగారిపల్లి, గోరంట్ల-5వ అంగనవాడీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.
అనుమతిలేని లేఔట్లపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. నగర పంచాయతీ కమిషనర్‌కు సూచించారు. లేఔట్లను క్రమబద్ధీకరించడం ద్వారా ఆదాయం పెంచాలన్నారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో గురువారం సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
కోర్టు, పోలీసుల సమన్వయంతో 29వ తేదీన నిర్వహించే మెగా లోక్‌అదాలతను విజయవంతం చేద్దామని హిందూపురం అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శుక్రవారం పోలీసులతో మెగా లోక్ అదాలతపై సమీక్ష జరిపారు.
మండలంలో నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా బడిమానేసిన ఇద్దరు పిల్లలను ఎంఈఓ జానరెడ్డెప్ప శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఎనుములకొట్టపల్లికి చెందిన లక్ష్మీనారాయణ, శివమ్మ కుమారుడు గంగరాజు గొర్రెలు కాస్తున్నాడు.
పట్టణంలో ఎన్నో ఏళ్లుగా సొంతిల్లులేక వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. అలాంటి వారికోసం గత తెలుగుదేశం హయాంలో ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. పట్టణంలోని 3 వేల మందికిగాను కొటిపి సమీపంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2018 జనవరి 10న ఇళ్ల నిర్మాణానికి అప్పటి, ఇప్పటి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమిపూజచేసి పనులు ప్రారంభించారు.
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీరాములు, కొల్లకుంట నాగరాజు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఆబాద్‌పేటలోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నా రైతులకు విత్తన సమస్య వెంటాడుతోంది. గత సంవత్సరం వర్షాలు లేక దెబ్బతిన్న రైతన్నకు ఈ ఏడాది విత్తన వేరుశనగ లేక పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు రైతన్నలు విత్తనాన్ని సమూకుర్చే పనిలో ఉన్నారు.