• Home » Hindupur

Hindupur

VINAYAKA NIMAJJANAM ; నేడు వినాయక నిమజ్జనం

VINAYAKA NIMAJJANAM ; నేడు వినాయక నిమజ్జనం

వినాయక చవితి పురస్కరించుకుని హిందూపురంలో ఏర్పాటు చేసిన విగ్రహాల నిమజ్జన కార్యక్రమం శుక్రవారం జరు గనుంది. ఈ సందర్భంగ్లా ఎస్పీ రత్న గురువారం సాయంత్రం వినాయక విగ్రహా లు తరలివెళ్లే రహదారులను పరిశీలించారు. శోభయాత్ర ఏర్పాట్లపై ఆరాతీశారు. అనంతరం గుడ్డం కోనేరువద్ద భద్రత ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్‌పై పరిశీలిం చారు. ముఖ్యంగా పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు.

HELP VICTIMS : వరద బాధితులకు మహిళల సాయం

HELP VICTIMS : వరద బాధితులకు మహిళల సాయం

విజయవాడ వరద బాదితులకు అండగా హిందూపురం పట్టణ మహిళా సమాఖ్య సభ్యులు తమవంతు సాయం అందజేశారు. వారు సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1.5లక్షలు చెక్కును అందజేశారు. ఈ చెక్కును టీడీజీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, మునిసిపల్‌ వైస్‌ చైర్మన బలరాంరెడ్డి, కౌన్సిలర్‌ డీఈ రమేష్‌కు అందించారు.

VINAYAKA FESTIVAL : ఘనంగా గణపయ్యల నిమజ్జనం

VINAYAKA FESTIVAL : ఘనంగా గణపయ్యల నిమజ్జనం

వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని శనివారం ప్రతిష్ఠిం చిన విగ్రహాలకు మూడో రోజు సోమవారం విశేష పూజలు చేశారు. అన్న దానం చేపట్టారు. పలు చోట్ల లడ్టూల వేలం నిర్వహించారు. ఘనంగా నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. స్థానిక చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేశారు.

AGITATION ; ఇళ్లకు పట్టాలివ్వండి

AGITATION ; ఇళ్లకు పట్టాలివ్వండి

మండలంలోని పాలసముద్రం జాతీయ రహదారి కూడలి వద్ద ప్రభుత్వ స్థలంలో నివాసముంటున్న పేదలకు హక్కు పత్రాలివ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమ వారం గోరంట్ల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు హనుమయ్య ఆధ్వర్యంలో కూడలి వద్ద నివాసమున్న పేదలు సోమవారం ఆందోళన చేపట్టారు.

HANDRINIVA : హంద్రీనీవా కాలువ గండికి మరమ్మతులు

HANDRINIVA : హంద్రీనీవా కాలువ గండికి మరమ్మతులు

జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి హం ద్రీనీవా కాలువ ద్వారా గొ ల్లపల్లి రిజర్వాయర్‌కు నీ రు విడుదల చేయడంతో హంద్రీనీవా కాలువ గం డికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని టీడీపీ నాయకుడు వెంక టేశ్వర్‌రావు హెచఎనఎస్‌ అధికారులకు సూచించారు. మండలంలోని కోనాపురం సమీపంలో మడకశిర బ్రాంచ కెనాల్‌ ఎల్‌-5 వద్ద వైసీపీ పాలన లో హంద్రీనీవా కాలువకు పడిన గండి టీడీపీ నాయకులు, హెచఎనఎస్‌ అధికారులు గురువారం పరిశీలించారు. గండిపడిన ప్రదేశం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మరమ్మతు పనులు ప్రారంభించారు

VINAYAKA CHAVITI : మట్టి వినాయకుల పంపిణీ

VINAYAKA CHAVITI : మట్టి వినాయకుల పంపిణీ

పట్టణంలోని వాసవీ ఆలయంలో ఆర్యవైశ్య అఫిషియల్స్‌ అండ్‌ ప్రొఫిషనల్స్‌ అసోసియేషన (అవోపా) ఆధ్వర్యంలో 250 మట్టి వినాయక ప్రతిమలను గురువారం పంపిణీచేశారు. ఈ కార్యక్రమానికి అవోపా జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి జయంతి సత్యరామ్‌, జిల్లా మాజీ అధ్యక్షుడు జయంతి శ్రీనివాసులు, ముఖ్య అతిథులు గా హాజరైయ్యారు.

HINDUPUR : నాలుగు నెలలుగా అందని జీతాలు

HINDUPUR : నాలుగు నెలలుగా అందని జీతాలు

పురంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే పారిశుధ్య కార్మికులు నాలుగు నెలలుగా జీతాలు అందకపోవ డంతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. పనులు చేసి పస్తులుం డాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం ప్రభు త్వాసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 26 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. వారు గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు బహష్కరించి ని రసన తెలిపారు.

VINAYAKA CHAVITI : వినాయక మండపాలు సిద్ధం

VINAYAKA CHAVITI : వినాయక మండపాలు సిద్ధం

వినాయక చవితిని పురస్కరించుకుని హిందూపురంలో విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు మండపాలను సిద్ధం చేశా రు. గతంలో ఎన్నడూలేని విధంగా భారీ ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేయ నున్నారు. కరోనా తరువాత ఎక్కువ సంఖ్యలో విగ్రహాల ఏర్పాటు ఈసారి జరుగనున్నట్లు పోలీసుల వద్ద అనుమతులను బట్టి తెలుస్తోంది.

TALENT : పురంవాసి ప్రతిభ

TALENT : పురంవాసి ప్రతిభ

పట్టణానికి చెందిన నృత్యకారిణి చంద్రబాను చతుర్వేది భరతనాట్యంలో ప్రతిభ కనబరచి, అమెరికా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఉత్తరప్రదేశలోని కాశీవిశ్వనాథుడి సన్నిధిలో సోమవారం నిర్వహించి న అంతర్జాతీయ నృత్య పోటీల్లో ఆమె తన బృందంతో కలిసి పాల్గొన్నారు. 9 వేల మంది నృత్యకారిణులు భరతనాట్యం, కూచిపూడి, కథక్‌ తదితర నృత్యాలు చేశారు.

HINDUPURAM ROADS ; రోడ్లు ఇలా... ఇళ్లకు చేరేది ఎలా?

HINDUPURAM ROADS ; రోడ్లు ఇలా... ఇళ్లకు చేరేది ఎలా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ప్రముఖ వాణిజ్య కేంద్రంగా హిందూపురం ప్రసిద్ధి. కర్ణాటక రాజధాని బెంగళూరు దగ్గరగా ఉండటంతో వ్యాపార, వాణిజ్య కేంద్రంగా మారింది. అయితే అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉంది. పట్టణంలోని ప్రముఖ ప్రాంతాలైన టీచర్చ్‌ కాలనీ, హౌసింగ్‌బోర్డు, కరెంటు రంగప్ప లే అవుట్‌, డీఆర్‌ కాలనీ, శ్రీకంఠపురం పాత ఊరు, సీపీఐ కాలనీ పక్కన తదితర ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి