Home » Himachal Pradesh
హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు బుధవారం.. మండి బీజేపీ లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్(Kangana Ranaut)కు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తన నామినేషన్ పత్రాలను కావాలనే పక్కన పెట్టారని, దీని వెనక కంగనా ఉన్నట్లు కిన్నౌర్ నివాసి లాయక్ రామ్ నేగి ఆరోపించారు.
రుతు పవనాల ప్రభావంతో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలు వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించడంతో వర్షాల ప్రభావం స్పష్టంగా తెలుస్తోంది. కుండపోత వర్షాలతో కొన్ని ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్ లోని మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 2, బీజేపీ ఒక సీటు కైవసం చేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా దేహరా నియోజకవర్గం నుంచి 9,399 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.
తనను కలవాలంటే ఆధార్ కార్డుతో రావాలంటూ నియోజకవర్గ ప్రజలకు మండీ ఎండీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ నిబంధన విధించడం రాజకీయ దుమారం రేపుతోంది. కంగనా తీరు సరికాదని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.
మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే గతంలో ఆయన రెండు కెబినెట్లలలో పని చేసిన వారికి ఈ సారి మంత్రి పదవులు దక్కలేదు. అందులో పలువురు కీలక నేతలున్నారు.
ఈరోజు ఉదయం ఘరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు(bus) ఆకస్మాత్తుగా లోయలో పడిపోయింది. దీంతో బస్సులో ఉన్న డ్రైవర్, కండక్టర్‌తో సహా నలుగురు చనిపోయారు. వీరిలో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల వద్ద అద్భుత నృత్య ప్రదర్శనతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు తాడిపత్రి బాలికలు. మే 13, 15 తేదీల్లో మైనస్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలో దాదాపు గంటన్నరపాటు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. తాడిపత్రికి చెందిన వందన డ్యాన్స అకాడమి విద్యార్థినులు సాయిమైత్రి, జోషిత, వర్ధిని, నవ్యశ్రీ, సాహిత్య, ...
తెలంగాణలో నకిలీ, నాసిరకం ఔషధాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఉత్తుత్తి మందులను అమ్ముతూ కేటుగాళ్లు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ అధికారులు చేస్తున్న దాడుల్లో నకిలీ మందుల ముఠాలు భారీగా బయటపడుతున్నాయి.
దేశ రాజధాని(Delhi) ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్రమవుతున్న వేళ సుప్రీం కోర్టు(Supreme Court) ఇటీవలే అక్కడి ప్రభుత్వాన్ని సంక్షోభ నివారణకు తీసుకున్న చర్యలపై పిటిషన్ దాఖలు చేయాలని కోరింది.
చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎ్‌సఎఫ్‌కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ తనను కొట్టారని బాలీవుడ్ నటి, బీజేపీ తరఫున తాజా ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్ నుంచి ఎన్నికైన ఎంపీ కంగనా రనౌత్ ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఢిల్లీకి వెళ్లటం కోసం తాను చండీగఢ్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, భద్రతాపరమైన తనిఖీల అనంతరం సీఐఎ్‌సఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ తనతో వాగ్వాదానికి దిగి చెంపదెబ్బ కొట్టారని కంగన తెలిపారు.