Home » Himachal Pradesh
హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పొదుపు చర్యలు తీసుకుంటోంది.
హరియాణా అసెంబ్లీకి ఆక్టోబర్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు.. బీజేపీయేతర పక్షాలకు ఆయుధంగా మలచుకున్నాయి. అందులోభాగంగా రైతుల పట్ల బీజేపీ మైండ్ సెట్ ఎలా ఉందనేందుకు కంగనా రనౌత్ వ్యాఖ్యలే నిదర్శనమని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది.
రైతుల నిరసనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్ఠానం తప్పు పట్టింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ ఆమెను మందలించింది.
కుండపోత వర్షాలతో ఉత్తరాది అతలాకుతలమవుతోంది. ఆదివారం ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొట్టాయి.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో దేశంలోని వివిధ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. అయితే దేశంలోని అయిదు రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ జాబితాలో పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, కోంకణ్ ప్రాంతం, గోవా, మధ్య మహారాష్ట్ర ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో ఆ యా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఉత్తరాదితో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.
కుంభవృష్టి కారణంగా సంభవించిన మెరుపు వరదల్లో గల్లంతైన హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు జిల్లాలకు చెందిన 45 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు.
హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి వర్షాలతో వరద పోట్తెత్తింది. ఆ క్రమంలో సిమ్లా జిల్లాలోని రామ్‌పూర్‌లో సమేజ్ ఖాడ్ వద్దనున్న హైడ్రో ప్రాజెక్ట్ సమీపంలో ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో ఒకరు మృతి చెందగా.. 32 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సిమ్లా డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కాశ్యప్ వెల్లడించారు.
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం మేఘ విస్పోటంతో వచ్చిన ఆకస్మిక వరదలతో ఒక పాదచారుల వంతెన, మూడు తాత్కాలిక షెడ్లు కొట్టుకుపోయాయి. కులు జిల్లా తోష్‌నాలాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు.
వీధుల్లో ఎవరైనా గొడవ పడుతుంటే జనాలు ఏం చేస్తారు? కొందరైతే సినిమా చూస్తున్నట్లు అలాగే చూస్తూ ఉండిపోతారు, మరికొందరేమో ఆ గొడవని ఆపేందుకు ప్రయత్నిస్తారు.