Home » Himachal Pradesh
హిమాచల్ ప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఊహించని మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు నాయకత్వంపై అసంతృప్తితో బుధవారం ఉదయం రాజీనామా చేసిన కాంగ్రెస్ నేత, పీడబ్ల్యూడీ మంత్రి విక్రమాదిత్య సింగ్ సాయంత్రానికి కల్లా తన మనసు ర్చుకున్నారు. తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) క్రాస్ ఓటింగ్ వ్యవహారంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ (Jairam Ramesh) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రాస్ ఓటింగ్ అంశం నుంచి కాంగ్రెస్ పారిపోవడం లేదని, క్రాస్ ఓటింగ్ జరిగింది నిజమేనని అన్నారు. అయితే.. ఇది ఎందుకు, ఎలా జరిగిందో తెలుసుకుంటున్నామని చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం, ముఖ్యమంత్రి రాజీనామా చేయనున్నారనే వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు బుధవారంనాడు స్పష్టత ఇచ్చారు. తాను సీఎం పదవికి రాజీనామా చేయడం లేదన్నారు. తనను ఎవరూ రాజీనామా చేయమని అడగలేదని చెప్పారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ కారణంగా హిమాచల్‌లో రాజకీయ వేడి పెరిగింది.
ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ పబ్లిక్ వర్క్స్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ(BJP) నేతల నినాదాల కారణంగా స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా కీలక నిర్ణయం తీసుకున్నారు.
హిమాచల్ ప్రదేశ్ నుంచి ఏకైక రాజ్యసభ స్థానానికి మంగళవారంనాడు ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ గెలుపొందారు. కాంగ్రెస్ ప్రత్యర్థి అభిషేక్ మను సింఘ్విపై హర్ష్ మహాజన్ గెలుపొందారు.
మంచు కురిసే ప్రాంతాల్లో ప్రకృతి అందాలు చూపరులను ఎంతలా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది అలాంటి ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు క్యూకడుతుంటారు. మంచు గడ్డలపై...
దేశంలోని సౌత్ రాష్ట్రాల్లో ఎండాకాలం రాకముందే పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. కానీ ఉత్తరాదిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్దంగా ఉంది. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్‌లోని అనేక చోట్ల పెద్ద ఎత్తున మంచు వర్షం కురుస్తోంది.
హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా పర్యాటకురాలు పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ఈ ఘటన జరిగింది. టూరిస్ట్ సేఫ్టీ బెల్ట్‌ను సరిగ్గా పెట్టకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లా బడ్డి ఏరియాలోని పెర్‌ఫ్యూమ్ ఫ్యాక్టరీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 32 మంది గాయపడ్డారు.