Home » Hero Vishal
హీరో విశాల్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మధ్య కొనసాగుతున్న వివాదం కేసు విచారణ నుంచి న్యాయమూర్తి జయచంద్రన్ తప్పుకున్నారు. లైకా సంస్థకు విశాల్ రూ.21.30 కోట్ల రుణం చెల్లించాల్సి ఉంది. ఈ కేసు విచారణ మద్రాస్ హైకోర్టులో గత కొంతకాలంగా సాగుతోంది.
హీరో విశాల్ చెల్లి భర్తపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. విశాల్‌కు ఐశ్వర్య అనే సోదరి ఉన్నారు. ఆమెకు బంగారు దుకాణం వ్యాపారి ఉమ్మిడి క్రితిస్కు 2017లో వివాహం జరిగింది. కాగా.. ఐశ్వర్యపై సీబీఐ కేసునమోదు చేయడం స్థానికంగా సంచలనం కలిగించింది.
తాను రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు జరుగుతున్న ప్రచారానికి సినీ హీరో విశాల్(Hero Vishal) ఫుల్‌స్టాప్ పెట్టారు. అయితే, భవిష్యత్తులో ఏదేని నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ప్రజల్లో ఒకరిగా, ప్రజల కోసం గళం వినిపిస్తానని ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
యువ నటుడు విశాల్(Vishal) కూడా రాజకీయ అరంగేట్రం చేయనున్నారా?.. ఆయన కూడా నటుడు విజయ్(Actor Vijay) బాట పట్టనున్నారా?.. త్వరలోనే కొత్త పార్టీ స్థాపించేందుకు కసరత్తు మొదలుపెట్టారా?.. అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.