Home » Heat
ఎల్‌నినో బలహీనపడుతున్నా... దాని ప్రభావం మరో మూడు నెలల వరకూ ఉంటుందన్న వాతావరణ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో జూన్ వరకూ దేశంలో అత్యంత తీవ్ర వేసవి పరిస్థితులు ఏర్పడనున్నాయి. గత నెల రెండో వారం నుంచే దేశంలో..
వర్షాకాలంలో ఎండాకాలాన్ని ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం విజయవాడలో వాతావరణం అలాంటి అనుభూతినే ఇస్తోంది. నైరుతి ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించి నెలలు గడుస్తున్నా అడపాదడపా కురుస్తున్న చిరుజల్లులు మినహా వాతావరణం చల్లబడింది లేదు. ఇక ఎండలైతే వేసవిని తలపిస్తున్నాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
వడగాలుల తీవ్రతతో పలు రాష్ట్రాలు అల్లాడుతుండంతో కేంద్రం అప్రమత్తమైంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఐదుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
యూపీలోని బల్లియా జిల్లాలో 3 రోజుల వ్యవధిలో 54 మంది ప్రాణాలు కోల్పోగా.. 400 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఈ మరణాలకు గల కారణాలపై అధికారులు భిన్న వివరణలు ఇచ్చారు. తూర్పు ఉత్తరపరదేశ్ జిల్లాలోని ప్రభుత్వ వైద్యులు ఈ మరణాలకు అధిక ఉష్ణోగ్రతలే కారణమై ఉండొచ్చని చెప్పారు. అయితే ఈ మరణాలకు కారణాలు తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ఇన్‌చార్జ్, లక్నోకు చెందిన సీనియర్ ప్రభుత్వ వైద్యుడు ఏకే సింగ్.. మరణాలకు అధిక ఉష్ణోగ్రతలే కారణమనే విషయాన్ని తోసిపుచ్చారు.
ఉత్తరాది ప్రజలు మూడు రోజుల నుంచి విపరీతమైన వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి భగభగలు తట్టుకోలేక ఉత్తర ప్రదేశ్‌లో 54 మంది, బిహార్‌లో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలతో చాలా మంది ఆసుపత్రులకు వెళ్లవలసి వస్తోంది. ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నవారిలో అత్యధికులు 60 సంవత్సరాల వయసు పైబడినవారే.
రుతుపవనాలు ఆలస్యంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు ఎండ మంటలు మండిస్తుందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు అల్లూరి జిల్లా నెల్లిపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఏలూరు జిల్లా కుకునూర్, వేలేరుపాడు మండలాలతో పాటు మరో 212 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచనున్నాయి.