Home » Heat Waves
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మంగళవారం నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అత్యధికంగా 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 44.4, జగిత్యాల జిల్ల్లాలో 44.1, పెద్దపల్లి జిల్లాలో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
AP Heatwave Alert: ఏపీలో పెరుగుతున్న ఎండల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ మేరకు సంబంధింత అధికారులకు హోంమత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హోంమత్రి అనిత ఆదేశించారు.
ఓ వైపు మండే ఎండలు.. మరోవైపు ఈదురుగాలులు, వడగండ్ల వానలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి.
చైత్రం ప్రారంభంలోనే మాడుపగిలే ఎండలు కాస్తున్నాయి. ఇదే సమయంలో నిమిషాల వ్యవధిలో కారుమబ్బులు కమ్ముకుని ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములు పిడుగులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది.
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఎండ వేడికి తట్టుకోలేక జనం ఏసీలను, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. వాతావారణశాఖ పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
Heatwave Alert: ఏపీ వ్యాప్తంగా 66 మండలాల్లో ఇవాళ(శనివారం) వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు సాధ్యమైనంతా వరకు ఎండకు దూరంగా ఉండాలని, ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలో ఎండ తీవ్రత బాగా పెరిగింది. శనివారం రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మార్చిలోనే ఎండలు మాడు పగలగొడుతున్నాయి. పగటిపూట బయటకు అడుగుపెట్టాలంటేనే బాబోయ్ అనే పరిస్థితి నెలకొంటోంది. సోమవారం ఆదిలాబాద్ జిల్లా బేలలో 42 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
రాష్ట్రంపై భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో పగటిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.