Home » Haryana
శిక్షణా కార్యక్రమంలో భాగంగా అంబాలా ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన విమానం కొద్ది సేపటికే కుప్పకూలింది. అయితే పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై శాఖాపరమైన దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
ఫరిదాబాద్‌లో అరెస్టయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల అబ్దుల్ రెహ్మాన్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్‌లను నిర్వీర్వం చేశారు.
ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ గత ఎన్నికల్లో తనను అంబాలా కంటోన్మెంట్ సీటులో ఓడించేందుకు కుట్ర పన్నారని అనిల్ విజ్ ఇటీవల ఆరోపించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి చిత్ర సార్వరపై అనిల్ విజ్ 7 వేల ఆధిక్యంతో ఆ ఎన్నికల్లో గెలిచారు.
యమునా జలాల్లో "విషం'' కలపడం ద్వారా ఢిల్లీ ప్రజలను హతమార్చాలని చూస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హర్యానా కోర్టు బుధవారంనాడు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
Haryana Police: పోలీసులపై దుండగులు దాడులకు తెగ బడుతున్నారు. ఇది ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశంలో ఎక్కడో అక్కడ..ఎప్పుడో అప్పుడు ఈ తరహా ఘటనలు తరచూ చోటు చేసుకొంటున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో ఇదే తరహా చోటు చేసుకొంది.
నెహ్రూ యాదృచ్ఛికంగా ప్రధాని అయ్యారని, ఆ పదవికి సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అర్హులని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టార్ వ్యాఖ్యానించారు
చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో స్కూళ్లకు 15 రోజులు సెలవులు ప్రకటించారు. హర్యానా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జనవరి 16 నుంచి మళ్లీ పాఠశాలల్లో రెగ్యులర్ తరగతులు ప్రారంభం కానున్నాయి.
ప్రొకబడ్డీ లీగ్ టైటిల్ పోరుకు పట్నా పైరేట్స్, హరియాణా స్టీలర్స్ అర్హత సాధించాయి.
గురుగావ్ నివాసంలో గుండెపోటు రావడంతో ఓం ప్రకాష్ చౌతాలాను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ తుదశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు.
ఖనౌరీలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న దలేవాల్‌ను టికాయత్ గత వారంలో కలుసుకున్నారు. 70 ఏళ్ల కేనర్స్ పేషెంట్ అయిన దలేవాల్ నవంబర్ 26వ తేదీ నుంచి పంజాబ్-హర్యానా కనౌరి సరిహద్దు ప్రాంతం వద్ద ఆమరణ దీక్షలో ఉన్నారు.