Home » Haryana
శిష్యురాళ్లపై అత్యాచారం చేశారన్న కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్ మరోసారి పెరోల్‌పై విడుదల కానున్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ డేరాబాబా పెరోల్‌పై బయటకు రానున్నారు. పెరోల్ కోరుతూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని భారత ఎన్నికల కమిషన్ ఆమోదించింది.
కాంగ్రెస్ పార్టీ రామమందిర నిర్మాణానికి అడ్డుపడిందని, జమ్మూకశ్మీర్‌లో సంపూర్ణంగా రాజ్యాంగాన్ని అమలు కానీయలేదని, అసెంబ్లీల్లో, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ పాటించలేదని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేదని, కేవలం సొంత కుటుంబం కోసమే పనిచేసిందని మోదీ విమర్శించారు
దుష్యంత్ చౌతాలా బహిరంగ సభలో మాట్లాడుతుండగా కొందరు అగంతకులు గలభా సృష్టించి కాన్వాయ్‌పై ఇటుకలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో ఒక వాహనం అద్దాలు పగిలిపోయాయి. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు.
నరేంద్ర మోదీని గద్దె దింపేవరకూ తాను చనిపోనంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మాటల యుద్ధం జరుగుతోంది. దీనిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్యానాలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో స్పందించారు.
హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ప్రధాన అంశాలు, పార్టీ వైఖరిని ఏఎన్ఐకి సోమవారంనాడిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జైరామ్ రమేష్ వివరించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
అక్టోబర్ 5న జరుగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో స్వంతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఎనిమిది మంది పార్టీ నేతలపై బీజేపీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆరేళ్ల పాటు వీరిని పార్టీ నుంచి బహిష్కరించింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్యానాలోని ఫరీదాబాద్‌లో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇటీవల తాను జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ఎదురైన ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ 13 మంది తిరుగుబాటు నేతలపై హరియాణా కాంగ్రెస్ చర్యలు తీసుకుంది.
పార్టీ బహిష్కరణ వేటు పడిన ప్రముఖ నేతల్లో గల్బా ఎస్‌సీ నియోజకవర్గానికి చెందిన నరేష్ ధాండే, జింద్ నుంచి ప్రదీప్ దిల్, పుండ్రి నుంచి సజ్జన్ సింగ్, పానిపట్ రూరల్ నుంచి విజయ్ జైన్ తదితరులు ఉన్నారు. తిరుగుబాటు నేతలను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఉదయ్ భాను ఆదేశాలు జారీ చేశారు.