Home » Harish Kumar
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ మరుసటి రోజు నుంచి ఏపీలో జరిగిన అల్లర్లు, అరాచకాలపై మరోసారి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta)కు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ఫిర్యాదు చేశారు.
పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో గల పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈవీఎం, వీవీప్యాట్‌లను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఆ తర్వాత వారిని టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు అడ్డుకున్నారు. ఆయనకు పిన్నెల్లి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish kumar Gupta) తెలిపారు. 301 సమస్యాత్మాక ప్రాంతాలను గుర్తించి సోదాల నిర్వహించినట్లు తెలిపారు. సోదాల్లో ఎలాంటి పత్రాలు లేని 1104 వాహనాలు జప్తు చేసినట్లు చెప్పారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ (మే -13) ముగిసిన తర్వాత జరిగిన అలర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసింది. ఏపీలోని పల్నాడు, నరసరావుపేట, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ఘటనలపై సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు జరిపారు.
రాష్ట్రంలో పోలింగ్ తర్వాత జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశాలు వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ (Kanakamedala Ravindra Kumar) కోరారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసినా తర్వాత కూడా రాష్ట్రంలో వైసీపీ (YSRCP) అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఏపీ వ్యాప్తంగా వైసీపీ మూకలు పోలింగ్ రోజు(మే13) నుంచి భారీగా అల్లర్లు, అరాచకాలకు పాల్పడుతున్నాయి. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి వైసీపీ పెద్దఎత్తున దాడులకు ప్లాన్ చేసినట్లు ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు.