Home » Guntur
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి.సాయిప్రసాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్ కె.విజయానంద్ పదవీ కాలం ఫిబ్రవరి 28, 2026 నాటితో ముగియనుంది. ఆయన స్థానంలో జి.సాయిప్రసాద్‌ను ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..
బాపట్ల: వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రాప గ్రామంలో శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహ జీర్ణోద్ధరణ కార్యక్రమంతో పాటూ కనకదుర్గ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన విగ్రహ వాయు ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు(RRR) కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. వివరాల్లోకి వెళితే..
పల్నాడు అంటేనే పౌరుషాల గడ్డ అని, ఇక్కడకు వస్తే వైబ్రేషన్స్ వస్తాయని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వినుకొండలో నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు..
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరునితో వైసీపీ రాజకీయ పరచకాలు ఆడుతోందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. స్వామివారిని రాజకీయ ఆయుధంగా వాడుకోవడం దుర్మార్గమన్నారు.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి ‘ఏఐ సమ్మిట్’పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. బీజేపీ యువమోర్చా (BJYM) శ్రేణులు గుంటూరు, కర్నూల్ జిల్లాల్లో కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు చేశాయి. వివరాల్లోకి వెళితే..
రోడ్లపై గుంతలకు శాశ్వత పరిష్కారం చూపే యంత్రం నగరానికి వచ్చేసింది.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిమిషాల వ్యవధిలో మరమ్మతులు చేపట్టి రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టనుంది. అదే.. ఇన్ఫ్రారెడ్ రీసైక్లింగ్ పోత్ హోల్ అండ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ మెషిన్, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ రోడ్ల మరమ్మతుల్లో వేగం, నాణ్యత, ఖర్చు తగ్గింపే లక్ష్యంగా ఈ మెషిన్ కీలక పాత్ర పోషిస్తుంది. నగరాభి వృద్ధి దిశగా ఇదో ముందడుగు.
గుంటూరులో అంబటి రాంబాబు మరోసారి పోలీసులపై రెచ్చిపోయారు. రాజమండ్రి నుంచి గుంటూరుకు ర్యాలీగా వచ్చిన అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు.
పల్నాడు జిల్లా వినుకొండలో భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో వినుకొండతో పాటు నడిగడ్డ పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది.
జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ముందడుగు వేశారు. ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘క్రియాశీలక సభ్యత్వ నమోదు’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.