Home » Gulf News
అంతర్జాతీయ సమాజం ఎంత చెప్తున్నా, చివరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టిగా హెచ్చరిస్తున్నా ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ భూభాగంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్ లోపలికి దూసుకెళ్లి మరి ప్రతీకార దాడులకు దిగింది.
ఇరాన్‌తో అమెరికా జరిపే ఎలాంటి ఒప్పందాన్నైనా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించక తప్పదని, ఆయనకు మరో ప్రత్యామ్నాయం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తాజాగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
లెబనాన్‌ను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ మరోసారి మిసైళ్లను ప్రయోగించింది. వీటిని మార్గమధ్యంలోనే అడ్డుకున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్‌పై ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది.
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ బ్రిటన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగిన నేపథ్యంలో... ఇరు దేశాలు తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి వైవెట్ కూపర్ పిలుపునిచ్చారు.
కువైట్, బహ్రెయిన్‌పై ఇరాన్ మళ్లీ మిసైల్స్ ప్రయోగించడంతో గల్ఫ్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ మిసైల్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో ఇరు దేశాల మధ్య జరిగిన తాజా సైనిక చర్యలు పశ్చిమాసియాలో ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రమాదంలో పడేశాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సజీవంగానే ఉన్నారని, ఆయన దేశ వ్యవహారాల్లో మరింత చురుగ్గా పాల్గొంటున్నారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు. యూఎస్ సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీకి ఈ మేరకు ఆయన ఈ తాజా అప్‌డేట్ ఇచ్చారు.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలక దౌత్యపరమైన ముందడుగు పడింది. వాషింగ్టన్‌లో జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం, ఇజ్రాయెల్, లెబనాన్ ప్రభుత్వాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ గనుక అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడితే, ఆ దేశంపై మళ్లీ పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించడానికి అది మంచి కారణంగా మారుతుందని హెచ్చరించారు.
మరో అమెరికా విమానాన్ని ఇరాన్ దళాలు కూల్చేసినట్టు స్థానిక మీడియా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే, అమెరికా మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చింది.