• Home » Gulf News

Gulf News

మళ్లీ యుద్ధం మొదలవుతోందా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్..

మళ్లీ యుద్ధం మొదలవుతోందా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్..

పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శాంతి ఒప్పందం కుదురుతున్న దశలో అమెరికా-ఇరాన్‌లు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేసింది.

పశ్చిమాసియాలో భారత్ ప్రభావం తగ్గిపోయింది: సోనియా

పశ్చిమాసియాలో భారత్ ప్రభావం తగ్గిపోయింది: సోనియా

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, పాలస్తీనా, గాజా సంక్షోభంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తప్పుబట్టారు. మోదీ వహిస్తున్న రాతి మౌనం దేశ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తోందన్నారు.

పాక్ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్ మునీర్‌పై ‘మొసాద్’ దాడికి ప్లాన్? బ్రెజిల్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు!

పాక్ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్ మునీర్‌పై ‘మొసాద్’ దాడికి ప్లాన్? బ్రెజిల్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు!

స్విట్జర్లాండ్‌లో జరిగిన ఇరాన్-యూఎస్ శాంతి చర్చల్లో పాల్గొనేందుకు వెళ్లిన పాకిస్థాన్ సైన్యాధిపతి, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను లక్ష్యంగా చేసుకుని, ఇజ్రాయెల్ గూఢచార సంస్థ 'మొసాద్' వ్యూహాత్మక దాడికి ప్రణాళిక రచించిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

నాలుగు నెలల కనిష్ఠానికి చమురు ధరలు

నాలుగు నెలల కనిష్ఠానికి చమురు ధరలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు దిగొస్తున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. చమురు ఉత్పత్తి, రవాణా సానుకూలంగా మారిన నేపథ్యంలో చమురు గిరాకీ తగ్గింది. దీంతో ధరలు పతనమవుతున్నాయి.

అమెరికాతో ఒప్పందంలో 'మిసైల్స్' లేవు.. భవిష్యత్తులోనూ చేర్చం: ఇరాన్

అమెరికాతో ఒప్పందంలో 'మిసైల్స్' లేవు.. భవిష్యత్తులోనూ చేర్చం: ఇరాన్

ఇరాన్ మిసైల్స్ ప్రోగ్రామ్‌పై ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందంలో ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్ భాగం కాదని, భవిష్యత్తులో కూడా దీనిని ఎలాంటి ఒప్పందాలలోనూ చేర్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

యూఎస్‌తో డీల్ మాకు అనుకూలం: ఇరాన్ అధ్యక్షుడు

యూఎస్‌తో డీల్ మాకు అనుకూలం: ఇరాన్ అధ్యక్షుడు

అమెరికాతో డీల్‌లోని అంశాలు తమకు అనుకూలమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. త్వరలో తాము సాధించిన విజయాలు అందరికీ తెలుస్తాయని చెప్పారు.

ఇరాన్‌ మహిళకు శిక్షగా 74 కొరడా దెబ్బలు.. ఎందుకంటే..

ఇరాన్‌ మహిళకు శిక్షగా 74 కొరడా దెబ్బలు.. ఎందుకంటే..

హిజాబ్ లేకుండా సంగీత ప్రదర్శన ఇచ్చిన ఒక ఇరాన్ మహిళకు స్థానిక కోర్టు 74 కొరడా దెబ్బలను శిక్షగా విధించింది. ఈ ఉదంతంపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

శాంతి ఒప్పందాన్ని  ధ్రువీకరించిన ఇరాన్..

శాంతి ఒప్పందాన్ని ధ్రువీకరించిన ఇరాన్..

అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరినట్లు ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించింది. అయితే, వాషింగ్టన్ తన వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చినట్లు క్షేత్రస్థాయిలో నిర్ధారించుకున్న తర్వాతే.. తుది ఒప్పందం కోసం ప్రతిపాదించిన '60 రోజుల చర్చల కాలం' లోకి అడుగుపెడతామని ఇరాన్ స్పష్టం చేసింది.

యూఎస్‌తో డీల్‌పై గుస్సా.. ఇరాన్‌లో మిన్నంటిన నిరసనలు

యూఎస్‌తో డీల్‌పై గుస్సా.. ఇరాన్‌లో మిన్నంటిన నిరసనలు

యూఎస్‌తో డీల్ కుదరనుందన్న వార్తలు ఇరాన్‌లో నిరసనలను రగిలించాయి. దేశ ప్రయోజనాల విషయంలో విదేశాంగ శాఖ మంత్రి అరాగ్చీ రాజీ పడ్డారంటూ ప్రజలు పలునగరాల్లో నిరసనలకు తెరతీశారు.

ఒమన్ తీరాన చమురు నౌకలో పొగలు.. 20 మంది భారత నావికులు సురక్షితం!

ఒమన్ తీరాన చమురు నౌకలో పొగలు.. 20 మంది భారత నావికులు సురక్షితం!

పశ్చిమాసియా సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఒమన్ తీరంలో వాణిజ్య నౌక ప్రమాదానికి గురైంది. ఇవాళ ఒమన్ తీరానికి సమీపంలో ‘ఎంటీ జల్‌వీర్’ అనే చమురు నౌకలోని ఇంజిన్ రూమ్‌లో అకస్మాత్తుగా పెద్దఎత్తున పొగలు వ్యాపించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి