Home » Gulf News
దళారుల మాటలు నమ్మి భారత్ నుంచి సౌదీ అరేబియా వెళ్లి ఎడారిలో ఒంటెల కాపరిగా పని చేసే ఓ వ్యక్తి దుర్భర జీవితం ఇతివృత్తంగా ఇటీవల ఆడు జీవితం అనే సినిమా వచ్చింది.
బంగ్లాదేశీయులు లక్షల సంఖ్యలో గల్ఫ్ దేశాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. స్వదేశంలో పరిణామాలను సోమవారం వీరంతా అత్యంత ఆసక్తిగా పరిశీలించారు.
కొలువు కోసం సౌదీకొచ్చిన తెలంగాణ వాసి మూడు రోజులకే మృత్యువాతపడ్డాడు. ఇది తెలియని యజమాని, విధులకు రాకుండా అతడు పారిపోయాడంటూ కేసు పెట్టాడు. అయితే నెల రోజుల తర్వాత అతడు చనిపోయిన విషయం స్వదేశంలోని అతడి కుటుంబసభ్యులకు తెలిసింది.
గల్ఫ్, తదితర దేశాల్లోని వలస కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలని, రూ.500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
‘ఇంట్లో పరిస్థితులు బాగాలేక, కుమారుడికి మంచి చదువులు చదివిద్దామని ఆశపడి తణుకుకు చెందిన ఏజెంట్ సంజయ్ అనే వ్యక్తి ద్వారా రెండేళ్ల క్రితం ఒమాన్ రాజధాని మస్కట్‌కు వెళ్లాను. అక్కడ ఇంటి పని, పిల్లలను చూసుకునే పనికి కుదిరాను.
బహ్రెయిన్‌లోని తెలుగు కళా సమితి ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కువైత్‌లో బుధవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదం నుంచి మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మండలం కొమ్మగూడేం గ్రామానికి చెందిన గంగయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను కువైత్‌లోని అదన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుర్ఘటనకు సంబంధించి వివరాలను అతను ఆంధ్రజ్యోతికి వివరించాడు.
ఎడారి దేశాలలోని తెలంగాణ ప్రవాసీయులు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను పోటాపోటిగా ఘనంగా నిర్వహిస్తున్నారు.
గల్ఫ్ దేశాల్లోని ప్రవాసీ భారతీయుల కోసం నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపూరి అర్వింద్ అండ దండ.. గా నిలిచారని గల్ఫ్ ఐక్య వేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ బరిలో దిగుతున్న అర్వింద్‌ను మరోసారి గెలిపించి.. పార్లమెంట్‌కు పంపాలని ప్రవాసీయులకు, వారి కుటుంబాలకు గల్ఫ్ ఐక్య వేదిక విజ్జప్తి చేసింది.
హైదరాబాద్: గల్ఫ్ ఏజెంట్లకు చట్ట బద్దత ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారి ద్వారా మాత్రమే కార్మికులు విదేశాలకు వెళ్లాలని, వారం రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చేలా వ్యవస్థ ఉండాలన్నారు.