Home » Group-1
గ్రూప్-1 మెయిన్ పరీక్షలను అక్టోబరు 21 నుంచి 27 దాకా.. వరుసగా ఏడు రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అధికారులు నిర్ణయించారు. రోజూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల దాకా పరీక్షలు జరుగుతాయి.
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్(Group-1 Mains) పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ(TSPSC) విడుదల చేసింది. పరీక్షలు అక్టోబర్ 21నుంచి 27వరకు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ఆదివారం టీజీపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సుమారు 74శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంతో పోలిస్తే ఈసారి పరీక్షలో ప్రశ్నలు కొంతమేర సులువుగా ఉన్నాయని అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు (Group-1 prelims exam) ఇవాళ (జూన్ 9న) ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 31జిల్లాల్లో 4లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఆదివారం నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. సుమారు 4.03లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రేపు (జూన్ 9న) గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను(group 1 prelims exam) నిర్వహించనుంది. జూన్ 9న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఈ నెల 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష 2024 కోసం హాల్ టిక్కెట్లను(Hall Tickets) కాసేపట్లో అధికారులు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inను సందర్శించి TSPSC గ్రూప్ 1 హాల్ టికెట్ 2024ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ(Telangana)లో ఎట్టకేలకు జూన్ 9న గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్(Group 1 Prelims Exam) జరగనుంది. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హాయంలో రెండు సార్లు ఎగ్జామ్ నిర్వహించగా, రెండు సార్లు పేపర్ లీక్ అయిన నేపథ్యంలో పరీక్షను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి నిబంధనలను మరింత కఠినతరం చేశారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.
గ్రూపు-1 పోస్టుల భర్తీలో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందుగానే అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.