Home » Gorantla Butchaiah Choudary
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశారని..
ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 12న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు చర్చంతా చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరు ఉండబోతున్నారు.. అనుభవానికి పెద్దపీట వేస్తారా.. యువతకు అవకాశాలు ఇస్తారా అనే చర్చ సాగుతోంది.
ఏపీ శాసనసభ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదలైంది. రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఘన విజయం సాధించారు. 60వేలకు పైగా ఓట్ల మెజార్టీతో బుచ్చయ్యచౌదరి విజయం సాధించారు.
ఏపీలో ఎన్నికలు (AP Elections) అయిపోయాయి.. లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది.! మరో 15 రోజుల్లో ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు అనేది తేలిపోనుంది.! అయినా ఫలితాలపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 5 నియోజకవర్గాలది ఒక ఎత్తు.. రాజమహేంద్రవరం రూరల్, గోపాలపురం నియోజకవర్గాలది మరో ఎత్తు.. ఇక్కడి నుంచి ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇద్దరు మంత్రులు పోటీపడ్డారు...
ఏపీ సీఎం గులకరాయి డ్రామా ఆడుతున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ‘కోడి కత్తి కమలాసన్ ఈజ్ బ్యాక్!’ అంటూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలు వస్తున్నాయంటే జగన్‌కు ఇలాంటి డ్రామాలు అలవాటుగా మారాయని దుయ్యబడుతున్నాయి. నేడు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికలకు జగన్ డ్రామా ఆడుతున్నాడని విమర్శించారు.
ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు భారీగా కమీషన్లు కొట్టేశారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaih Chowdary) అన్నారు. గురువారం నాడు టీడీపీ (TDP) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లాలో అన్ని స్థానాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Andhrapradesh: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌ను నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని గ్రామాలకు గంజాయి చీడ పాకి పోయిందన్నారు. పోలీసులకు ప్రతిపక్షాలపై ఉన్న శ్రద్ధ నేరస్తులపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి సమాచారం ఇస్తే కానీ ఇక్కడి యంత్రాంగం మేలుకోలేదని ఎద్దేవా చేశారు.
జగనన్న కాలనీల్లో భారీ కుంభకోణం జరిగిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Butchaiah Chowdary) అన్నారు. గురువారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...ముఖ్యమంత్రికే సిగ్గులేకుండా పూర్తికాని పనులను ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రారంభింస్తున్నారని మండిపడ్డారు.
Janasena Candidates: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జనసేన జోరు పెంచుతోంది. కూటమిలో భాగంగా జనసేనకు వచ్చిన అన్ని సీట్లలోనూ పాగా వేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐదు మంది అభ్యర్థులను ప్రకటించిన పవన్.. తాజాగా.. మరో సీనియర్ నేతను నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు..
Andhrapradesh: మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బాబాయ్ హత్య కేసులో ప్రమేయం ఉన్నందునే దర్యాప్తుకు ఆటంకం కల్పిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్యకు జరిగిన కుట్రలో కచ్చితంగా జగన్ పాత్ర ఉందని సంచలన కామెంట్స్ చేశారు.