Home » Godavari
కృష్ణా, భీమా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి మళ్లీ వరద పెరుగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి సోమవారం 1,32,324 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 1,30,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
సీతారామ ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక దశలో కంటతడి పెట్టుకున్నారు. ప్రచారం కోసం బటన్‌లు నొక్కే వ్యక్తిని తాను కాదని స్పష్టం చేశారు.
గోదావరి-కావేరి అనుసంధానంలో వాటాగా వచ్చే నీటిని సమ్మక్క బ్యారేజీ పరిసరాల్లో కాకుండా.. పూర్వ నల్గొండ జిల్లా గొట్టిముక్కల ఎగువన 45 టీఎంసీల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లను కేంద్ర నిధులతో కట్టించి, వాటి నుంచి వాడుకునే వీలు కల్పించాలని తెలంగాణ కోరింది.
వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ జలశయాలన్నీ నిండుకుండలా మారాయి. శ్రీశైలం నుంచి భారీగా వరద కొనసాగుతుండడంతో గురువారం నాగార్జునసాగర్ జలాశయం అన్ని గేట్లూ తెరుచుకున్నాయి.
గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. శనివారం సాయంత్రం 5 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 8.50 అడుగులుగా ఉంది. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 5,81,417 క్యూసెక్కులు ప్రవాహం వెళుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి పాండ్ లెవల్ 13.26 మీటర్లుగా ఉంది.
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండటంతో.. వాటి కింద ఉన్న ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజులుగా ఎగువ నుంచి కృష్ణమ్మకు భారీగా వరద వస్తుండటంతో జలాశయాలన్నీ నిండు కుండలా మారాయి.
నదుల అనుసంధాన ప్రక్రియ మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రంలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన ప్రధాని మోదీ గోదావరి - కావేరి నదుల అనుసంధానంపై దృష్టి సారించారు. ఈ సంధానం రాష్ట్రానికి మేలు చేసేలా...
కృష్ణమ్మ ఉధృతికి నాగార్జున సాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం నుంచి 8 గేట్ల ద్వారా 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.40 అడుగుల వద్ద 14,45,047 క్యూసెక్కుల వరద ప్రవాహిస్తుండడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రహదారులపై వరద నీరు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం ఏజెన్సీ జల దిగ్బంధంలో చిక్కుకుంది.
గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాచలం ఏజెన్సీ జల దిగ్బంధంలో చిక్కుకుంది. శనివారం సాయంత్రం 4.16 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరుకోవడంతో ఆర్డీవో దామోదర్‌రావు మూడో(తుది) ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.