Home » Godavari
Godavari River incident: కోనసీమలో విషాదం.. సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు, సహాయక బృందాలు నది వద్దకు చేరుకుని గల్లంతయినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక మృతదేహం లభ్యం కాగా మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న గోదావరిలో స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం గోదావరిలో నీటి లభ్యతపై ఏపీ లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు ఈనెల 21న ఢిల్లీలో నిర్వహించతలపెట్టిన సమావేశాన్ని వాయిదా వేయాలని సీడబ్ల్యూసీకి లేఖ రాశింది. 24వ తేదీన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (TAC) సమావేశం ఉన్నందున ఈ సమావేశం వాయిదా వేయాలని తెలంగాణ కోరింది
తెలంగాణ మరియు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మరోసారి వివాదం చోటు చేసుకుంది. గోదావరికి వరద వస్తే పోలవరం కారణమా అని ఏపీ స్పందించింది, నీటిని నిల్వ చేయకపోతే బ్యాక్‌వాటర్‌కు ఆస్కారం ఉండదు అని వివరించింది
తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క కుటుంబానికీ అన్యాయం జరగదని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అవసరాలకు అనుగుణంగా గోదావరి నదీ జలాలను తరలించి నగరవాసులకు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి-బనకచర్ల అనుసంధానంపై తెలంగాణ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టును విస్తరించి.. ఈ అనుసంధానం చేపడుతున్నారని తప్పుబట్టింది.
బనకచర్ల ప్రాజెక్టు పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో కృష్ణా వరద జలాలు బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలించే ప్రతిపాదనపై చర్చ జరుగనుంది
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 15( ఆంధ్రజ్యోతి): రానున్న గోదావరి పుష్కరాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు అ ందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియో గం చేసుకోవాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని తక్కు వ నీటి వినియోగం- దుర్గం
రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 28( ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం గోదావరి నదిలో బోట్ రేస్ అట్టహాసంగా జరిగింది. నదీజలాలపై అవగాహన కల్పించడానికి జాతీయ జలవనరుల శాఖ, జలశక్తి విభాగం, నదీసంరక్షణ సంస్థ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరిలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. దీనిని కమిషనర్ కేతన్ గార్గ్ జెండా ఊపి ప్రారంభించారు. పుష్కరాలరేవు ఎదురుగా ఉన్న గోదావరి లం
తాళ్లపూడి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పర్వదినాన తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడికి చెందిన ఐదుగురు మిత్రుల జలసమాధితో గ్రామం యావత్తూ శోకసంద్రంలో మునిగి పోయింది. గోదావరి నదీ తీరంలో కన్న బిడ్డలను పోగొట్టుకున్న కుటుంబాల వారి ఆర్తనాదాలతో, వారి బంధువుల ఓదార్పులతో తల్లడిల్లింది. చనిపోయిన వారి మృతదేహాలను వెతికే సమయంలో జిల్లా కలెక్టరు ప్రశాంతి అక్కడికి విచ్చేసి బాధిత కు