• Home » God

God

 DURGADEVI : దుర్గమ్మకు బోనాలు

DURGADEVI : దుర్గమ్మకు బోనాలు

ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా ఆదివారం పట్టణంలోని దుర్గమ్మదేవికి భక్తులు బోనాలు సమర్పించారు. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన మహిళలు చౌడేశ్వరి దేవి కట్ట నుంచి బోనాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా దుర్గమ్మ అలయానికి వెళ్లారు. బోనాలను అమ్మవారికి సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయాల ఎదుట నిమ్మకాయలతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

PALAPATIDINNE : కోరిన కోర్కెలు తీర్చే  పాలపాటి దిన్నె ఆంజనేయస్వామి

PALAPATIDINNE : కోరిన కోర్కెలు తీర్చే పాలపాటి దిన్నె ఆంజనేయస్వామి

కోరిన కోర్కెలు తీర్చే కరుణామయుడిగా పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామి విరాజిల్లుతున్నాడు. శ్రావణమాసోత్సవాలకు ఆలయం లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కదిరి ప్రాంతంలో ఖాద్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం తరువాత నల్లచెరువు మండలంలోని పాలపాటి దిన్నె ఆంజనేయస్వామికి అంత టి ప్రాముఖ్యత ఉంది. ప్రతి శని, మంగళవారాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించు కుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు నడుపుతారు.

GODDESS : శాకంబరిగా చౌడేశ్వరీదేవి

GODDESS : శాకంబరిగా చౌడేశ్వరీదేవి

పట్టణంలోని చౌడేశ్వరీ కాలనీ లో వెలసిన చౌడేశ్వరీదేవి శని వారం శాకంబరీదేవి అలంక రణలో భక్తులకు దర్శనమిచ్చా రు. ఆషాఢ మాసాన్ని పురస్క రించుకుని ఆలయంలో అమ్మ వారికి ప్రత్యేక అభిషేకాలు, పూ జలు చేశారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసా దాలను అందజేశారు.

NARASIMHA SWAMY : వైభవంగా పెన్నోబులేశుడి పల్లకి సేవ

NARASIMHA SWAMY : వైభవంగా పెన్నోబులేశుడి పల్లకి సేవ

మండల పరిధిలోని పెన్నహోబిలం లక్ష్మీ నరసిం హస్వామి ఆలయంలో శనివారం స్వామి వారి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఉత్సవమూర్తిని పట్టువస్ర్తాలతో అలంకరించి పల్లకిలో కొలువుదీ ర్చారు. మేళతాళాల మధ్య ఆలయం చుట్టూ ఊరే గించారు. ఆషాఢ మాసం చివరి శనివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, స్వామిని దర్శించుకున్నారు.

NETTIKANTI : కసాపురంలో తిరుమంజన స్నపనం

NETTIKANTI : కసాపురంలో తిరుమంజన స్నపనం

పునర్వసు తిరునక్షత్రం సందర్భంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం సీతారామచం ద్రస్వామి వార్లకు తిరుమంజన స్నపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో సీతారాముల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి.. తిరుమంజన స్నపనం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదా లను అందజేశారు.

 Urusu : మస్తాన వలికి గంధం సమర్పణ

Urusu : మస్తాన వలికి గంధం సమర్పణ

పాత గుంతకల్లులో వెలసిన హజరత సయ్యద్‌ మస్తాన వలి 389 ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం గంధం వేడుకను ఘనంగా నిర్వహించారు. గణాచారి నాగభూషణం రెడ్డి ఇంటి నుంచి వేకువాజామున అశ్వం మీద స్వామి వారి గంధాన్ని తీసుకుని బయలుదేరారు. మేళాతాళాల మధ్య దివిటీల వెలుగులో దర్గాకు చేరుకున్నారు. శివాలయం వద్ద ఉన్న బావిలో నీటిని తీసుకువచ్చి భక్తులు అశ్వం పాదాలకు పోసి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం ...

RATHOTSAVAM : కన్నుల పండువలా వేణుగోపాలస్వామి రథోత్సవం

RATHOTSAVAM : కన్నుల పండువలా వేణుగోపాలస్వామి రథోత్సవం

మండలంలోని మే రెడ్డిపల్లిలో వేణుగోపాలస్వామి రథోత్సవాన్ని బుధవా రం కన్నులపండువలా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన బ్రాహ్మణులు తమ ఇలవేల్పు అయిన మే రెడ్డిపల్లి వేణుగోపాలస్వామిని అనాదిగా ఆరాధిస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా ఆషాఢమాసంలో వారు గ్రా మానికి వచ్చి స్వామికి విశేష పూజలు నిర్వహి స్తారు. ఆషాఢమాసం రోహిణి నక్షత్రం రోజున రథోత్సవం నిర్వహించడం అనవాయితీ.

NARASIHMA SWAMY : ఖాద్రీశుడిని దర్శించుకున్న ఏడీజే

NARASIHMA SWAMY : ఖాద్రీశుడిని దర్శించుకున్న ఏడీజే

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కదిరిలో వెలసిన నరసింహ స్వామిని జిల్లా అడిషన కోర్టు న్యాయాధికారి సత్యవాణి శనివారం దర్శించు కున్నారు. ఏడీజే వెంట స్థానిక న్యాయాధికారులు ఎస్‌ ప్రతిమ, పీ మీనాక్షి సుందరి ఇతర సిబ్బంది ఆలయానికి వచ్చారు. వారికి తూర్పు రాజగోపురం వ ద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం న్యాయాధికారులు స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ విశిష్టత వివరించారు. ప్రత్యేక పూజలు చేసి, స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

VRATAM : భక్తి శ్రద్ధలతో ఏడు శనివారాల వ్రతం

VRATAM : భక్తి శ్రద్ధలతో ఏడు శనివారాల వ్రతం

పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో వెలసిన లక్ష్మీవెంక టేశ్వరస్వామి ఆలయంలో మూడో శనివారం ఏడు శనివారాల వ్రతాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రాజేశ స్వామి మూల విరాట్టును పట్టువస్ర్తాలతో అలంకరించి పూజలు చేశారు. అ నంతరం మహిళల చేత ఏడు శనివారాల వ్రతం చేయించారు.

 Vemulawada Bhimalingeswara Swamy: వేములవాడ భీమలింగేశ్వరస్వామి

Vemulawada Bhimalingeswara Swamy: వేములవాడ భీమలింగేశ్వరస్వామి

మండలంలోని గడేకల్లు గ్రామంలో వెలసిన వేములవాడ భీమలింగేశ్వరస్వామి మహా రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఉదయం స్వామి వారిని ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం స్వామికి ప్రీతి పాత్రమైన మద్యాన్ని, మాంసాన్ని నైవేద్యంగా పెట్టి పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తెల్లరుజామున ఉత్సాయంను ఆలయం వద్ద నుంచి గ్రామ చావడి వరకూ లాగారు. సాయంత్రం నిర్వహించిన మహా రథోత్సవ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. కర్నూలు, బళ్లారి, అనంతపురం, బెంగళూరు, వంటి ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి