Home » God
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను హిందూపురం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల వ్యాప్తంగా సోమవారం కన్నుల పండువగా నిర్వ హించారు. ఆలయాల్లో తెల్లవారు జాము నుంచే అభిషేకాలు, అర్చన లు, అలంకరణ తదితర ప్రత్యేక పూ జలు చేశారు. పలు చోట్ల స్వామి కల్యాణోత్సవాలను నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం, అన్నదాన కార్యక్రమా లు చేపట్టారు.
విజయనగరం జిల్లా జామిలో పురాతనమైన రాతి శిలా శాసనాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇవి 900 సంవత్సరాల కిందట తూర్పు గంగ చక్రవర్తి అనంత దేవ వర్మ చెక్కించినవిగా భావిస్తున్నారు.
పట్టణంలో ప్రసిద్ధిచెందిన శనీశ్వరుడి ఆలయా నికి శ్రావణమాస మూడో శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4.30కే జరిగిన తొలి పూజ, నవగ్రహ తైలాభిషేకానికి భ క్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు శీతలాంబకు కుంకుమార్చ న చేయించారు. శనీశ్వరుడికి ఇష్టమైన నల్లనువ్వులు, నల్లగుడ్డలు అగ్ని గుండంలో వేసి, ప్రదక్షిణ చేసి శనిమహాత్మా మా జోలికి రావద్దని వేడుకు న్నారు.
పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాల యంలో శనివారం ఉదయం నుంచి శ్రావణమాసం పురస్కరించుకొని ఏడు కొండల స్వామి వ్రతాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య వైభవంగా సాగింది. పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉద యం 6 గంటల నుంచి గణపతి పూజ, గంగపూజ, గోపూజా తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
మండలంలోని జిల్లేడగుంట గ్రామంలో వెలసిన కంబాల సనసింహస్వామికి గ్రామస్థులు సోమవా రం జ్యోతుల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వా రికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను రఽథంపై ఉంచి జిల్లేడగుంట, భక్తరహళ్లి గ్రామాల్లో ఉరేగిం చారు. స్వామివారి రథంతో పాటు భక్తులు జ్యోతులను నెత్తిన పెట్టుకుని ఆలయం చుట్లూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
వరలక్ష్మి వత్రాన్ని శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణాలతో పాటు గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా ఆల యాల్లో మూలవిరాట్లకి విశేష అలంకరణ చేసి పూజలు చేశారు. మహిళలు ఆలయాలకు పెద్దఎత్తున తరలివచ్చి సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిం చారు.
శ్రావణ మాసం అనగానే గుర్తొచ్చేది వ్రతాలు, నోములు, పూజలు.. ముఖ్యంగా శ్రావణ మాసంలో శుక్రవారం వచ్చిందంటే చాలు.. లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తుంటాం. సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఈ మాసంలో ఆచరించే వాటిలో వరలక్ష్మీ వ్రతం ప్రధానమైనది.
వీరశైవ లింగాయత సంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఆమిదాలగొంది గ్రామంలో నూతనంగా నిర్మిం చిన శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలను సోమవారం వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచి వేదపండితులు హోమాలు చేశారు. ఆలయంలో శివలింగం, పార్వతి, సుబ్రహ్మణ్యేశ్వర, నందీశ్వర విగ్రహాలను ప్రతిష్ఠించారు. అలాగే ధ్వజ స్తంభం, విమానగోపురం కలశ స్ధాపన చేశారు. మందుగా మహిళలు కలశాలతో ఊరేగిం పుగా వచ్చి ఆలయ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకోన్నారు.
లోక కల్యాణార్థం ఆదివారం పాతూరు దత్తాత్రేయ మందిరంలో శ్రీనివాసుడి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ...
నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో గడిచిన ఐదేళ్లలో రూ.6.50 కోట్ల దోపిడీ జరిగిందని నసనకోట పంచాయతీ ప్రజలు ఆరోపించారు. ఆలయ ఆవరణలోని గదులు, వ్యాపార అనుమతులకు బుధవారం నిర్వహించిన వేలంపాటలో రూ.89.65 లక్షల ఆదాయం వచ్చిందని, దీని ప్రకారం లెక్కవేస్తే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థమౌతుందని అన్నారు. దోపిడీ వెనుక అప్పటి ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి బ్యాచ ఉందని ఆరోపించారు. ఆలయ కమిటీ మాజీ సభ్యులు రామ్మూర్తినాయుడు, ఈఓ వెంకటేశ్వర్లు, దేవదాయశాఖ జిల్లా ఇనస్పెక్టర్, పోలీసు ...