• Home » God

God

GANESH FESTIVAL : మట్టి వినాయకుడిని పూజిద్దాం

GANESH FESTIVAL : మట్టి వినాయకుడిని పూజిద్దాం

మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షి ద్దాం అంటూ స్ధానిక మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషషర్‌ జబ్బర్‌ మీయా ఆధ్వర్యంలో పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. రానున్న వినా యక చవతి పండుగ సందర్భంగా ప్రజలు, రసాయనాలతో చేసిన వినాయక ప్రతిమలు కాకుండా మట్టి వినాయకులను మాత్రమే పూజించాలని ఆయన కోరారు.

VINAYAKA FESTIVAL : వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలి

VINAYAKA FESTIVAL : వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలి

వినాయకచవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవా లని ఆర్డీఓ రాణిసుస్మిత, డీఎస్పీ రవిబాబు తెలిపారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఎంపీడీఓలు, సీఐలు, మున్సిపల్‌ కమిషనర్‌, తహసీల్దార్లతో వారు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

MAREMMA FESTIVAL : ఘనంగా మారెమ్మ ఉత్సవాలు

MAREMMA FESTIVAL : ఘనంగా మారెమ్మ ఉత్సవాలు

గుమ్మఘట్ట మండల సరిహద్దులో కర్ణాటక ప్రాంతంలోని గౌరసముద్రం అడ వి ప్రాంతంలో వెలసిన మారెమ్మ ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహిం చారు. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాది మంది హాజరై మొక్కులు తీర్చుకుంటారు. ఒక్క రోజు మధ్యాహ్నం జరిగే ఉత్సవాలకు అనాది చరిత్ర ఉంది. సాయంత్రానికి ఈ జాతరలో ఒక్కరూ ఉండరు.

వైభవంగా నాగేశ్వరుని ధ్వజస్తంభ శిఖర కలశ ప్రతిష్ఠ

వైభవంగా నాగేశ్వరుని ధ్వజస్తంభ శిఖర కలశ ప్రతిష్ఠ

చెన్నూరులోని లలితాంబికా సమేత నాగేశ్వరస్వామి ఆలయంలో గురువారం ధ్వజస్తంభ శిఖర కలశ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది.

KONERU : నిమజ్జనానికి నీరు సమకూరేనా...?

KONERU : నిమజ్జనానికి నీరు సమకూరేనా...?

రాష్ట్రంలోనే వినాయక నిమ జ్జనానికి హిందూపురానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి యేటా పురంలో వందలాది విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఈ సారి మరో అడుగు ముం దుకేసి మరింత భారీ విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్రతి యేటా స్థానిక గుడ్డం కోనేరులో విగ్రహాను నిమజ్జనం చేస్తారు.

RATHOTSAVAM ; ఘనంగా వేణుగోపాలస్వామి రథోత్సవం

RATHOTSAVAM ; ఘనంగా వేణుగోపాలస్వామి రథోత్సవం

కృష్ణాష్టమి వేడుకల సం దర్భంగా మండల కేంద్రమైన అమరాపురంలోని దక్షిణ గొల్లహట్టిలో వెల సిన వేణుగోపాలస్వామి రథోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని దేవాలయం నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా రథం వద్దకు తీసుకొచ్చారు.

ANJANEYA SWAMY : కసాపురంలో ప్రత్యేక పూజలు

ANJANEYA SWAMY : కసాపురంలో ప్రత్యేక పూజలు

కసాపురం దేవస్థానంలో శ్రావణ మాస నాలుగవ, చివరి మంగళవారం రోజున ఉత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, పరిచారకులు తెల్లవారుజామునే నెట్టి కంటి ఆంజనేయ స్వామి విరాట్టుకు అభిషేకాలు, అలంకారాలు చేశారు. ఆలయంలో హనుమాన చాలీసా, సుందరకాండ పారాయణాలు చేశారు. మధ్యాహ్నం మహా మంగళహారతిని నిర్వహించారు. రాత్రి సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను వెండి రథంపై ఉంచి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు.

RATHOTSAVAM ; వైభవంగా తోటప్పజ్ఞ స్వామి రథోత్సవం

RATHOTSAVAM ; వైభవంగా తోటప్పజ్ఞ స్వామి రథోత్సవం

మండలంలోని బొల్లనగుడ్డంలో వెలసిన తోటప్పజ్ఞస్వామి 47వ పూజోత్సవంలో భాగంగా మంగళవారం వైభవంగా రథోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుంచి గంగపూజ, గణపతిపూజ, నవగ్రహ పూజా, పంచామృతాభిషేకం, రుద్రహోమం నిర్వ హించి సాయంత్రం భారీ జనసందోహం మధ్య రథోత్సవాన్ని లాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హాజరై స్వామివారికి పూజలు జరిపించి రథాన్ని లాగారు.

KRISHNASHTAMI : సంతాన వేణుగోపాలస్వామికి ప్రత్యేక పూజలు

KRISHNASHTAMI : సంతాన వేణుగోపాలస్వామికి ప్రత్యేక పూజలు

పట్టణంలోని సంతాన వేణుగోపాలస్వా మి దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలను యాదవులు భక్తి శ్రద్ధలతో నిర్వ హించారు. స్వామివారికి బంగారు కవచధారణ చేశారు. ఉత్సవవిగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు. వినాయకసర్కిల్‌ వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేశారు. ఆల య కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంచేపట్టారు.

KRISHNASTAMI : భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు

KRISHNASTAMI : భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు

మండలంలోని కొట్టాలపల్లి వెలసిన రాధాకృష్ణ ఆలయంలో మంగళవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణుల మూలవిరాట్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశా రు. గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్త శ్రీనివాసయాదవ్‌, కమిటీ సభ్యులు గంగరాజు, రఘురాములు, రంగారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, రాజా, రామాంజనేయులు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి