Home » Gaza
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మధ్యప్రాచ్య సంక్షోభంపై చర్చలో స్లోవేనియా ప్రధానమంత్రి పాల్గొంటూ గాజాలో యుద్ధాన్ని నిలిపివేయమని బెంజమిన్ నెతన్యాహుకు నిష్కర్షగా చెప్పారు. ‘లెబనాన్ తదుపరి గాజా కాకూడదని’ ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి చాలా దూరదృష్టితో హెచ్చరించారు.
మూడు వేలకు పైగా పేజర్ బాంబుల బీభత్సం.. ఆ మర్నాడే వందల సంఖ్యలో వాకీటాకీల పేలుళ్లు.. ఈ దారుణాలు జరిగి వారం గడవక ముందే.. వందల క్షిపణులతో ముప్పేట దాడులు..!
గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. సోమవారం ఉదయం గాజాలోని న్యూసెరాట్ శరణార్థుల శిబిరం సమీపంలోని ఓ ఇంటిపై బాంబుల వర్షం కురిపించింది.
పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్నాయి. తాజాగా దక్షిణ పాలస్తీనాలో ఏర్పాటు చేసిన నిరాశ్రయ జోన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో 40 మంది మృత్యువాతపడ్డారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ మంగళవారం ప్రకటించింది. గాజా ప్రధాన దక్షిణ నగరమైన ఖాన్ యునిస్‌లోని అల్ మవాసీపై ఇజ్రాయెల్ ఆర్మీ ఈ దాడి చేసింది.
దాదాపు పది నెలలుగా ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా.. ఆదివారం మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది! హెజ్బొల్లా నేత ఫవాద్ షుకూర్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై కత్యూష రాకెట్లతో, డ్రోన్లతో దాడి చేయడానికి ఆ సంస్థ సిద్ధమైంది.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల కనీసం 50 మంది పాలస్తీనియన్లు మరణించారని, 124 మంది గాయాలపాలయ్యారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరో యుద్ధం అంచున ఉన్న పశ్చిమాసియాలో మరో భీకర దాడి..! సెంట్రల్ గాజాలోని తబీన్ పాఠశాలపై శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వరుసగా మూడు క్షిపణులను ప్రయోగించింది. హమా్‌సపై పది నెలలుగా టెల్ అవీవ్ సాగిస్తున్న యుద్ధంలో ఇదొక అతి పెద్ద ఘటనగా అభివర్ణిస్తున్నారు.
గాజా(Gaza) నగరంలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్.. శనివారం వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో కనీసం 15 మంది పాలస్తీనియన్లు మరణించారు.
తల్లి చనిపోయాక కూడా గర్భం నుంచి పిల్లలు పుట్టే సన్నివేశాలను మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ.. ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఇలాంటి అద్భుతం చోటు చేసుకుంది. అవును..
హమాస్ మిలటరీ కమాండర్ మహమ్మద్ దెయిఫ్ లక్ష్యంగా దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 71 మంది మృతి చెందారు. 289 మంది గాయపడ్డారు. అయితే దాడిలో మహమ్మద్ దెయిఫ్ చనిపోయాడో లేదో తెలియలేదు.