Home » Ganga
వారాణసిలో గంగా హారతి తరహాలోనే కావేరి నదికి కావేరి హారతి నిర్వహించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar) తెలిపారు. మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకాలోని కేఆర్‌ఎస్ జలాశయాన్ని డీకే సందర్శించారు.
బీహార్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. పాట్నాలోని ఉమానాథ్ గంగా ఘాట్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ గంగానదిలో మునిగిపోయింది. ఆదివారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురి జాడ గల్లంతైంది.
దేశంలోని అయోధ్య, వారణాసి, హరిద్వార్ సహా పలు ప్రాంతాల్లో గంగా దసరా(Ganga Dussehra 2024) పండుగ ఘనంగా ప్రారంభమైంది. గంగా దసరా పండుగ సందర్భంగా గంగామాతను పూజించడం, గంగా నదిలో స్నానం చేయడం, దానధర్మాలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. ఈ క్రమంలో ఉత్తరాఖండ్(Uttarakhand), యూపీ(UP) సహా అనేక ప్రాంతాల్లో గంగా నది ఘాట్ల వద్ద భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.
చిత్తూరు: నగరంలో బజారు నడివీధి గంగమ్మ జాతర మంగళవారం ఉదయం ఘనంగా మొదలైంది. జాతర వేడుకలను వంశపారంపర్య ధర్మకర్త కుటుంబం, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ముసుగు తొలగించి వేడుకలు ప్రారంభించారు.
శ్రీ తాతయ్య గుంట ‘‘గంగమ్మ జాతర’’ ఈరోజు (బుధవారం) ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతరలో బైరాగి వేషంలో భక్తులు గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. నేటి నుంచి ఈనెల 21వ తేదీ వరకు ఈ జాతర అత్యంత వైభవంగా జరుగనున్నది. నేటి నుంచి రోజుకో వేషంలో గ్రామదేవతకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ అభ్యర్థిగా తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో మూడోసారి నామినేషన్ వేసిన నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ పార్టీ వరుస ప్రశ్నలు సంధించింది. సొంత నియోజకవర్గంలో వైఫల్యాలపై ప్రధాని జవాబివ్వాలంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేశారు.
పవిత్ర హిమాలయ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి ధామ్‌లు మేలో యాత్రికులను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాయి, ఇది ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్రకు నాంది పలికింది. ఆ దేవ దేవుని దర్శించుకునే యాత్రికులకు అన్ని సదుపాయాలను అందించేందుకు సన్నాహాలు జరిగాయి.
మనిషికి నమ్మకం ఎంతో బలమైంది. చేయగలననే నమ్మకం ఉంటే చాలు.. ఏదైనా సాధించేస్తాననే భరోసా ఇస్తుంది. కానీ.. అదే నమ్మకం మితిమీరిపోతే..
భారత దేశ టాప్ రెజ్లర్లు తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ, తాము గెలిచిన పతకాలను గంగా నదిలో కలుపుతామని ప్రకటించారు.
భారత దేశ టాప్ రెజ్లర్లు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. తమ పతకాలను మంగళవారం సాయంత్రం 6 గంటలకు హరిద్వార్‌లోని గంగా నదిలో విసిరేస్తామని, ఇండియా గేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.