Home » Ganesh Chaturthi
నగరంలో జరిగే గణేష్ నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ సిటీ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా, సరూర్‌నగర్ మినీ ట్యాంక్ బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నిమజ్జనం ఏర్పాట్లను రాచకొండ సీపీ సుధీర్ బాబు ఈరోజు(సోమవారం) పరిశీలించారు.
శ్రావణమాసం అంతా నాన్ వెజ్ తినకుండా ఉంటారు. వినాయక చతుర్థితి వచ్చిందంటే చాలు.. నాన్‌వెజ్‌తో పండుగ చేస్తారు. వినాయకుడికి సైతం నాన్‌వెజ్ వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. కొత్తగా పెళ్లైన కూతురు, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి పెద్ద ఎత్తున పార్టీ చేసుకుంటారు. ఈ విచిత్ర ఆచారం ఎక్కడుంది? వారు ఎందుకిలా చేస్తారు? అనే వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
వినాయక మండపంపై రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు. ఆందోళన తీవ్రతరం కావడంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు..
గణేష్ చతుర్థి 2024 పండుగ వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ముంబైలో నిన్న రాత్రి జరిగిన గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో అనంత్ అంబానీ, ఆయన భార్య రాధిక మర్చంట్ సహా అంబానీ ఫ్యామిలీ మొత్తం పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘శివశివ మూర్తివి గణనాథా.. నువ్వు శివుని కుమారుడవు గణనాథా’ అం టూ భక్తులు వినాయకుని పూజించారు.
ప్రస్తుతం దేశం మొత్తం గణేశ్ నామస్మరణలో మారుమోగిపోతోంది. వీధి వీధికీ ఓ గణపయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, 11రోజుల పాటుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే కొందరు గణేశ్ విగ్రహాల సెలక్షన్ దగ్గర నుంచి.. వాటిని తీసుకురావడం..
సకల విఘ్నాలనూ తొలగించే విఘ్నేశ్వరుడికి తీపి పదార్థాలు ఎంతో ఇష్టం. కాబట్టి, వినాయక చవితి రోజున స్వామికి వారికి స్వీట్స్ నైవేద్యంగా పెడితే ఎంతో ఫలప్రదమని పురాణాలు చెబుతున్నాయి.
దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. గణపతి వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ బడా గణేష్ తొలి పూజలు అందుకున్నారు.
దేశవిదేశాల్లో ఖ్యాతి గడించిన ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు. ఖైరతాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ప్రారంభించి ఏడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది 70 అడుగుల మూర్తిని శిల్పులు సిద్ధం చేశారు. సప్త ముఖాల్లో ఓవైపు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరోవైపు సరస్వతి, లక్ష్మి, పార్వతుల మధ్య గణపతి ఉండేలా విగ్రహాన్ని సిద్ధం చేశారు.
కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలుపడదని నివారించాడు.