Home » Ganesh Chaturthi
వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గణేశ్ మండపాలకు ఈ ఏడాది కూడా 9 రోజుల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రకటించారు.
మార్కెట్‌లో అసలైన మట్టి వినాయకుడిని ఎలా గుర్తించాలి? మట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (PoP) విగ్రహాల మధ్య తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఖైరతాబాద్ భారీ గణపతి ఆగమన్‌కు సిద్ధమయ్యాడు. శుక్రవారం రాత్రి గణేశ్ ఆగమన్‌ను నిర్వహించేందుకు ఖైరతాబాద్‌కు చెందిన యువజన సంఘాలు నిర్ణయించాయి.
వినాయక చవితి సందర్భంగా ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించేందుకు చాలామంది కొత్త విగ్రహాన్ని కొనుగోలు చేస్తారు. అయితే గణేశుడి విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలని సంప్రదాయాలు చెబుతున్నాయి.
గణేశ్ చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణనాథులనే ప్రతిష్ఠించాలని హెచ్‌ఎండీఏ పిలుపునిచ్చింది.
గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. మండపాల ఏర్పాటు నుంచి గణేశ్ నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాబోయే వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను భాగ్యనగరంలో అత్యంత శాంతియుత వాతావరణంలో వైభవంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశించారు.
హైదరాబాద్‌లోని మల్లిఖార్జున నగర్ యూత్ అసోసియేషన్ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడు వికసిత భారత్ 2047 థీమ్‌లో భాగంగా రోబో ఆకారంలో గణపతిని ఏర్పాటు చేయనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
వినాయక చవితి సందర్భంగా నిర్వహించే లడ్డూ వేలంలో భారీ ధరకు లడ్డూను సొంతం చేసుకున్న వ్యక్తి అందరినీ ఆకట్టుకున్నాడు. తర్వాత పెట్టుబడుల పేరిట పలువురిని మోసగించాడు.
గణేశ్ విగ్రహాల గరిష్ట ఎత్తు 16 అడుగులకు పరిమితం చేయాలని తయారీదారులను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశించారు. వినాయక చవితి సమీపిస్తుంది. ఈ నేపథ్యంలో విగ్రహాల తయారీ దశ నుంచే భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని వారికి స్పష్టం చేశారు.