Home » Gandhi Bhavan
Konda Murali: తాను బలహీనుడినా.. బలవంతుడినా అనేది అందరికీ తెలుసని.. తనను రెచ్చగొట్టొద్దని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. గాంధీభవన్‌లో క్రమ శిక్షణ కమిటీతో కొండా మురళి సమావేశమయ్యారు.
మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా నేతలు అందరూ కలిసి పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్లో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పని చేస్తేనే పదవులు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.
TG News: సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతే అజెండాగా మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాలు, సలహా కమిటీల ఉమ్మడి భేటీ జరగనుంది. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన నేతలకు నియామక పత్రాలు అందజేస్తారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలని కాంగ్రెస్ కేడర్‌కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. కార్యకర్తలకు పార్టీలో తగిన గౌరవం ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
Gajjal Kantham: రాష్ట్ర ముఖ్యంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే కాళేశ్వరంపై విచారణ చేయిస్తామని మాట ఇచ్చారని, పీసీసీ చీఫ్‌గా ఉన్నపుడే రేవంత్ రెడ్డి కాళేశ్వర ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయట పెట్టారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం అన్నారు.
కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి వెంటనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారిద్దరినీ తెలంగాణ గడ్డపై ప్రతిఘటిస్తామని ప్రకటించారు.
ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ల సమావేశం ఆదివారం నాడు గాంధీభవన్‌లో జరిగింది. ఇన్‌చార్జ్ మీనాక్షికి కార్పొరేషన్ చైర్మన్లు పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. జిల్లాల్లో ప్రోటోకాల్ ఇవ్వడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో తమను కలుపుకుపోవడం లేదని ఫిర్యాదు చేశారు.
Gandhi Bhavan: గాంధీభవన్ నుంచి పలువురు కాల్స్ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు ముప్పై మందికి గాంధీభవన్ సబ్బంది కాల్స్ చేసి ఈరోజు రావాల్సిందిగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హనుమంతరావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో వారిద్దరూ యూత్ కాంగ్రెస్‌లో పని చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలోని ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలని ఈ అంశంపై నియమించిన ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి సూచించినట్టు తెలిసింది. గతంలోలా ‘ఏ బీ సీ డీ’గా కాకుండా ఇప్పుడు ‘ఏ బీ సీ’ గ్రూపులుగా వర్గీకరించాలని ప్రభుత్వానికి సమర్పించిన తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.