Home » Gajwel
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి దాదాపు 10 నెలలు అయింది. నేటికి బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ మాత్రం నియోజకవర్గంలో పర్యటించడం లేదు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన నగదు జీతంగా తీసుకుంటూ.. ఆయన నియోజకవర్గంలో ప్రజలు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతేడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. దీంతో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ ప్ర్తతిపక్షానికి పరిమితమైంది. అయితే కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్‌కు మాత్రమే పరిమితమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు హాజరు కాలేదు. సరికదా.. ఎమ్మెల్యేగా ప్రతిపక్షనేతగా గజ్వేల్ నియోజకవర్గంలో సైతం ఆయన పర్యటించలేదు.
కేటీఆర్‌కు పదవీకాంక్ష ఎక్కువని, దీంతో ఆయన తన తండ్రి కేసీఆర్‌ను ఏమైనా చేశాడేమోనని అనుమానం వస్తోందని, ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్‌ను రక్షించుకోవడం మనందరి బాధ్యత అని మంత్రి కొండా సురేఖ అన్నారు.
మల్లన్నసాగర్ ముంపు గ్రామలతో పాటు పునరావాస కాలనీ గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీలో విలీనం కానున్నాయి. ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం బుధవారం జారీ చేసింది.
రాష్ట్రంలో పలు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన అథారిటీల పరిధిలోని వివిధ శాఖల కార్యాలయాలు మరో ప్రాంతానికి మారబోతున్నాయి.
గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలైనప్పటి నుంచి కనబడటం లేదని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే చెప్పాలని, వారికి తగిన బహుమానం ఇస్తామని బీజేపీ నాయకులు గజ్వేల్ పట్టణంలో పోస్టర్లు వేశారు.
పేదల ఆకలి తీర్చిన నాయకుడు మోదీ అని.. ప్రజా సేవలో అబ్రహం లింకన్, మోదీ తమదైన ముద్ర వేశారని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన వర్సిటీ మూడో స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ మాట్లాడారు.
నీటిపారుదలశాఖలో శుక్రవారం కీలక అధికారులు పదవీ విరమణ చేయనున్నారు. ఈఎన్‌సీ(ఓ అండ్‌ఎం, క్వాలిటీ కంట్రోల్)గా పని చేస్తున్న భూపతిరాజు నాగేంద్రరావుతోపాటు ఎస్‌ఈలు టి.వెంకటేశ్వరరావు, ఎ.మురళీధర్, ఎస్.మురళీకృష్ణ, ఈఈలు జి.శ్రీనివాస్, కె.రాములు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(డీఈఈలు) చెన్నం రవీంద్రారెడ్డి, మేళ్లచెరువు వెంకట రామశర్మ రిటైర్ కానున్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే సమయం ఆసన్నమైంది. రేపు ( గురువారం ) మధ్యాహ్నం 12:45 నిమిషాలకు...