Home » Gadde Rama Mohan
Andhrapradesh: నగరంలోని భవన నిర్మాణ కార్మికులు బుధవారం ఉదయం సమావేశమయ్యారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని, టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పనులు లేక పస్తులు ఉన్న పరిస్థితి వివరిస్తూ కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. సీఎంగా జగన్ వచ్చాక భవన నిర్మాణ కార్మికులు కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: విజయవాడ తూర్పు నియోజకవర్గం భారతీనగర్‌లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ దారుల ప్రాణాలు పోయినా ... జగన్‌కు రాజకీయ లబ్ది ముఖ్యమని మండిపడ్డారు. నెల క్రితమే కోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వలేదన్నారు. మానవత్వం లేకుండా వృద్ధులను ఇబ్బందులు పెట్టి చంద్రబాబుపై నింద వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ మేనిఫెస్టోపై నేడు ఆ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్ధి స్పందించారు. ఇవాళ తూర్పు నియోజకవర్గం రాణిగారితోటలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు గద్దె రామ్మోహన్, కేశినేని చిన్ని (శివనాథ్) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్ధించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా... వారి ఆటలు సాగవని.. ప్రజలు అప్రమత్తతతో ఉన్నారని తెలిపారు. ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన ఉందని కేశినేని చిన్ని అన్నారు.
Andhrapradesh: ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవగా.. ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలయ్య, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఇలా ప్రముఖులు సహా అనేక మంది నామినేషన్లు వేసేశారు. ఈరోజు (సోమవారం) తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గా గద్దె రామ్మోహన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
తూర్పులో ఈ దఫా ద్విముఖ పోటీ నెలకొంది. వరుసగా 2 సార్లు విజయకేతనం ఎగురవేసి హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్న గద్దె రామ్మోహన్ ఈ సారి తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి తరపున రంగంలో నిలవగా.. వైఎస్‌ఆర్‌సీపీ తరపున మొదటిసారి దేవినేని అవినాష్ బరిలో ఉన్నారు.
నేడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అరాచకాలు, రౌడీయిజం పెరిగిపోయాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్(MLA Gadde Rammohan) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రం కోసం, రాక్షస పాలనను తరిమి కొట్టడానికే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు పొత్తులతో ముందుకు సాగుతున్నారని చెప్పారు.
టీడీపీ సీనియర్ నేతలు కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం కేశినేని చిన్ని మాట్లాడుతూ.. 60 కంపెనీల్లో ఉద్యోగాల కోసం వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హయాంలో ఏపీ కళకళలాడుతోందన్నారు. ఎక్కడెక్కడి నుంచో యువత ఏపీకి తరలి వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కరికి కూడా ఉద్యోగం లేదన్నారు.
Andhrapradesh: వైసీపీ పాలనలో ఏపీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శలించారు. కంపెనీలు తేకపోగా.. జగన్ ఉన్న వాటిని కూడా తరిమేశారని మండిపడ్డారు. వేల మందికి ఉపాధి ఇచ్చిన అమర్ రాజా కంపెనీ వెళ్లిపోయేలా చేశారన్నారు.
Andhrapradesh: ‘‘నా సమర్ధత గురించి ఎంపీ కేశినేని నాని మాట్లాడటం హాస్యాస్పదం’’ అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో మెజారిటీ పెంచుకున్న తాను సమర్థుడినో, ఓట్ల శాతం తగ్గిన కేశినేని నాని సమర్థుడో ఆయనే సమాధానం చెప్పాలన్నారు.
తానా ద్వారా తెలుగురాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని 'తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి' వెల్లడించారు. ఎస్.వి.ఎస్ కళ్యాణమండపంలో పుట్టగుంట వీరభద్రరావు జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు 'తానా ఫౌండేషన్ ట్రస్టీ పుట్టగుంట సురేష్' 100 మంది మహిళలకు 100 కుట్టు మిషన్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా అందజేశారు.