• Home » Gaddar

Gaddar

Gaddar : ఎల్బీస్టేడియం నుంచి కొనసాగుతున్న గద్దర్‌ అంతిమయాత్ర..

Gaddar : ఎల్బీస్టేడియం నుంచి కొనసాగుతున్న గద్దర్‌ అంతిమయాత్ర..

ఎల్బీస్టేడియం నుంచి అశ్రు నయనాల మధ్య ప్రజా యుద్ధనౌక గద్దర్‌ అంతిమ యాత్ర ప్రారంభమైంది. పోలీసుల గౌరవ వందనం.. స్లో మార్చ్, డెత్ మార్చ్‌లతో గన్ పార్క్‌కు అంతిమ యాత్ర బయలుదేరింది. గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీస్టేడియం నుంచి అమరవీరుల స్థూపానికి తీసుకెళ్లారు. అమరవీరుల స్థూపం వద్ద ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ అంతిమ యాత్రలో వేలాది మంది కళాకారులు, గద్దర్ అభిమానులు పాల్గొన్నారు.

Talasani Srinivas : కిషన్‌రెడ్డి, రేవంత్‌లను ఉద్దేశిస్తూ గద్దర్ భౌతిక కాయం వద్ద తలసాని సంచలన వ్యాఖ్యలు..

Talasani Srinivas : కిషన్‌రెడ్డి, రేవంత్‌లను ఉద్దేశిస్తూ గద్దర్ భౌతిక కాయం వద్ద తలసాని సంచలన వ్యాఖ్యలు..

ప్రజా యుద్ధ నౌక గద్దర్ భౌతిక కాయం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తలసాని మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. ఇది చిల్లర రాజకీయాలు చేసే సమయం కాదన్నారు.

Gaddar : గద్దర్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించడమంటే తమను అవమానించడమేనంటూ..

Gaddar : గద్దర్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించడమంటే తమను అవమానించడమేనంటూ..

ప్రజా యుద్ధ నౌక గద్దర్ నిన్న అస్తమించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం దీనిపై వివాదం చెలరేగుతోంది. గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికలాంచనాలతో చేయాలనుకోవడం పోలీసు అమరవీరులను అగౌరవ పరచడమేనంటూ యాంటి టెర్రరిజం ఫోరం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

 Gaddar Death: పొద్దు వాలిపోయింది

Gaddar Death: పొద్దు వాలిపోయింది

‘‘పొడుస్తున్న పొద్దు మీద’’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు. బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది.

Gaddar No More : గద్దర్ చివరి మాటలు గుర్తు చేసుకొని గుండెలవిసేలా రోదించిన విమల..!

Gaddar No More : గద్దర్ చివరి మాటలు గుర్తు చేసుకొని గుండెలవిసేలా రోదించిన విమల..!

నాకేం కాదు.. నువ్వు ధైర్యంగా ఉండు.. సర్జరీ సక్సెస్ అయితది.. ఆరోగ్యంగా తిరిగొస్తా.. ఇంకో పదేళ్లు బతుకుతాను.. ఆరోగ్యం జాగ్రత్త.. ఇవీ ప్రజా యుద్ధనౌక గద్దర్ చివరిసారిగా తన సతీమణి విమలకు (Gaddar Wife Vimala) చెప్పిన మాటలు. అనుకున్నట్లుగానే గుండె ఆపరేషన్ (Heart Operation) విజయవంతంగా జరిగింది కానీ..

Gaddar Last Rites : కేసీఆర్ కీలక నిర్ణయం.. అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు

Gaddar Last Rites : కేసీఆర్ కీలక నిర్ణయం.. అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు

ప్రజా గాయకుడు, యుద్ధనౌక గద్దర్ (Gaddar) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిర్ణయించింది. జీవితాంతం వారు చేసిన త్యాగాలు ప్రజా సేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు..

Gaddar And Pawan : తమ్ముడా.. అని పవన్‌ను గద్దర్‌ చివరిసారిగా పలకరించి ఏం చెప్పారంటే..?

Gaddar And Pawan : తమ్ముడా.. అని పవన్‌ను గద్దర్‌ చివరిసారిగా పలకరించి ఏం చెప్పారంటే..?

ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూశారన్న (Gaddar Death) దుర్వార్తను అభిమానులు, కవులు, కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. గద్దర్‌ను గురువుగా, అన్నగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ (Janasena Chief Pawan) భావిస్తారన్న విషయం తెలిసిందే. ఆయన ఇకలేరన్న విషయం తెలుసుకున్న సేనాని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. గద్దర్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని, చివరిసారిగా ఆస్పత్రిలో కలిసి మాట్లాడిన విషయాలను గుర్తు తెచ్చుకుని పవన్ భావోద్వేగానికి లోనయ్యారు..

#RIP Gaddar : విమల సూచనతో గద్దర్ అంత్యక్రియలు అక్కడే.. రేపు సెలవు..!?

#RIP Gaddar : విమల సూచనతో గద్దర్ అంత్యక్రియలు అక్కడే.. రేపు సెలవు..!?

ప్రజా యుద్ధనౌక గద్దర్ (Gaddar) అలియాస్ గుమ్మడి విఠల్ ఆదివారం మధ్యాహ్నం తిరిగిరానిలోకాలకు చేరుకున్నారు. ఆయన మరణంతో అభిమానులు, కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. అపోలో ఆస్పత్రి నుంచి భౌతికకాయాన్ని నగరంలోని ఎల్బీస్టేడియానికి (LB Stadium) తరలించారు...

Gaddar No More : గద్దర్ మృతి పట్ల సీఎం కేసీఆర్, ప్రముఖుల సంతాపం

Gaddar No More : గద్దర్ మృతి పట్ల సీఎం కేసీఆర్, ప్రముఖుల సంతాపం

ప్రజా యుద్ధనౌక గద్దర్ (Gaddar) మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), పలువురు మంత్రులు, రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ కూడా ఉద్యమ గళానికి సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా.. తెలంగాణ కోసం గద్దర్ చేసిన సాంస్కృతిక పోరాటాన్ని, గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని గులాబీ బాస్ స్మరించుకున్నారు...

Gaddar: గద్దర్ కన్నుమూతపై టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ ఏమన్నారంటే..

Gaddar: గద్దర్ కన్నుమూతపై టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ ఏమన్నారంటే..

ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూతపై పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఏపీ సీఎం జగన్‌, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ‌తోపాటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఈటల రాజేందర్, కేశినేని చిన్ని, పోతుల బాలకోటయ్య, టీడీపీ నేత జవహర్‌, పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి