Home » Gachibowli
కాంగ్రెస్ సర్కార్ చెప్పిందని ఎవరైనా కొంటే డబ్బులు నష్టపోతారన్నారు. బాధ్యత గల సీఎంనన్న విషయం మరచి రేవంత్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
HCU Lands Case: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై గురువారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది..
కొన్నివేల వృక్షాలు, జంతువులు, పక్షులు, కీటకాలకు ఆవాసమైన కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని కట్టడాలుగా మారిస్తే, జీవ వైవిధ్యత దెబ్బతింటుందని పర్యావరణ శాస్త్రవేత్త అరుణ్ వాసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ సరదాగా కరాటే పోటీలో తలపడ్డారు. ఇరువురు కరాటే దుస్తులు ధరించి కాసేపు ప్రేక్షకులను అలరించారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ భూమి ఐఎంజీ అకాడమీకి కేటాయించబడినప్పటికీ, అకాడమీ ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడంతో, కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో కేటాయింపులను రద్దు చేసింది
కంచ గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం వేలానికి పెట్టిన 400 ఎకరాలు అటవీ భూమి అని, దానిని విక్రయించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనపై నల్లగొండ జిల్లా అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఓ ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేయగా, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌తోపాటు డిపార్ట్‌మెంటల్ అధికారి(డీవో)ని విధుల నుంచి తొలగించారు.
ఆర్థిక వనరుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ చేసి, వేలం వేయాలని నిర్ణయించిన రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబరు 25 పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమితో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ)కు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐఐఐటీ) జంక్షన్ నుంచి ఔటర్ రింగు రోడ్డు (ఎగ్జిట్ నంబర్ 1)కు దగ్గర్లో ఉన్న జీఏఆర్ రోటరీ వరకు 5 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్ నిర్మించాలని సర్కారు భావిస్తోంది.
త్వరలో హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవేదిక మీద చాటాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నప్పుడు నిర్వాహక రాష్ట్రంవైపు సహజంగానే ప్రపంచ దేశాలన్నీ చూస్తాయి.