Home » Gachibowli
రాష్ట్ర ప్రభుత్వం ఒక రియల్‌ఎస్టేట్ దళారి మాదిరిగా ఆర్థిక ప్రయోజనాల గురించి ఆలోచించకుండా, భవిష్యత్ ప్రయోజనాల కోసం కంచె గచ్చిబౌలి భూముల వేలాన్ని పూర్తిగా విరమించుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత నకిలీ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు.
హెచ్‌సీయూ క్యాంపస్ నుంచి పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూమిని కాపాడుకునేందుకు ఉద్యమించిన విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని వర్సిటీ ప్రొఫెసర్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
కంచ గచ్చిబౌలి భూముల వివాదం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధుల ఆందోళనల అంశంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది.
యంత్రాలతో చెట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతుండగా నెమళ్లు, ఇతర వన్యప్రాణులు భయంతో పారిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో పెట్టిన ఫొటో నకిలీదని తేలిందని, ఆ ఫొటో 99 శాతం ఏఐతో తయారు చేసిందని వెల్లడించారు.
ఆ జింక రక్తపు మరకలు రాహుల్ గాంధీ చేతికే అంటాయని ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు. కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతాన్ని రేవంత్‌రెడ్డి బుద్ధిహీనంగా ధ్వంసం చేయడం వల్ల విలువైన వృక్ష, జంతుజాలానికి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
హెచ్‌సీయూ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ చేయలేదని మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ స్పష్టం చేశారు. పోలీసుల విధులను అడ్డుకున్న కొందరు విద్యార్థులను చెదరగొట్టామని వివరించారు.
వివాదాన్ని పరిష్కరించి, భూముల విషయంలో ముందుకు వెళ్లేందుకు భాగస్వాములందరితో చర్చించడమే ధ్యేయంగా ముగ్గురు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తమ ఆదేశాలు అమలు చేయకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యులవుతారని, జైలుకు వెళతారని సుప్రీం కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.