Home » Flood Victims
రాష్ట్రంలో వరద నష్టం రూ.10,300 కోట్లు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది.
విజయవాడలో వరద బాధి తులకు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు.
విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
వరద బాధితులకు మదనపల్లె నియోజకవర్గ ప్రజలు అండగా నిలిచారని ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు. బుధవారం స్థానిక టౌనహాల్లో 3 వేల నిత్యావసర కిట్లు, 500 గ్యాస్ స్టౌవ్‌లు, ఇతర సామగిని ప్యాక్ చేసి లారీలకు లోడ్ చేశారు.
AP Deputy CM Pawan Kalyan - Telangana CM Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి వచ్చిన పవన్.. ఆయనను కలిశారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారు? ఆ విశేషాలేంటి? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
విజయవాడలో సంభవించిన వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలుద్దామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.
విజయవాడ వరద బాధితులకు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలోని మెప్మా విభాగం తరపున ఆర్థిక సాయం అందజేశారు. మెప్మా పొదుపు సంఘాల అధ్యక్షురాలు పార్వతి ఆధ్వర్యంలో మంగళవారం రూ. 1,21,200 చెక్కును ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసు లుకు అందజేశారు.
రాగల 72 గంటల్లో గోదావరి వరద మహోగ్ర రూపం దాల్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. అధికారులు సూచించే ఆదేశాలను లంక గ్రామాల ప్రజలు ఖచ్చితంగా పాటించి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
గోదావరి వరద ఉగ్రరూపం దాల్చడంతో బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. గోదావరి వరద ఉధృతి కారణంగా కోనసీమలోని గౌతమి, వృద్ధగౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయల్లో ప్రవాహ వేగం పెరుగుతోంది. ఇప్పటికే ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Andhrapradesh: భారీ వర్షాలతో గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి, కిర్లంపూడి మండలాల్లో ఏలేరు వరద తీవ్రత కొనసాగుతోంది. వరద ఉధృతికి 25 వేల ఎకరాలు నీట మునిగాయి.మూడు మండలాల్లో 23 గ్రామాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది.216వ జాతీయ రహదారిపై పిఠాపురం గొల్లప్రోలు మధ్య మూడు చోట్ల ఏలేరు వరద నీరు ప్రవహిస్తోంది.