Home » Flood Victims
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులకు ప్యాకేజీ ప్రకటించారు. ఈ మేరకు ప్యాకేజీ వివరాలతో కూడిన సమాచారాన్ని తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.
వరద బాధితుల తోడ్పాటుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) ఉద్యోగులు రూ.65 లక్షలు విరాళంగా అందించారు.
విజయ వాడ వరద బాధితుల సహాయార్థం మద నపల్లె భవన నిర్మాణ కార్మికుల సంఘం సభ్యులు రూ.2,00,116 వితరణగా అంద జేశారు.
విజయవాడ వరద బాధితుల సహా యార్థం మండలంలోని శింగవరం టీడీపీ నాయకులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి రూ.60వేల నగదు అందజేశారు.
ఎడ తెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్ అతలాకుతలమవుతుంది. రాష్ట్రంలోని నదులు గంగా, శారదా, గాగ్రా తదితర నదులు ప్రమాదకర స్థాయిని మించి పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా శనివారం మీరట్‌లోని మూడంతస్తుల భవనం కుప్ప కూలిన ఘటనలో 10 మంది మరణించారు.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న కాల్వలు, చెరువులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
బుడమేరు ప్రాంతంలో ఆక్రమణలు తొలగించేందుకు త్వరలోనే కమిటీ వేస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆ ప్రాంతంలో ఉంటున్న పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా టిడ్కో ఇళ్లు ఇస్తామని మంత్రి చెప్పారు. పూర్తిస్థాయిలో ఆక్రమణలు తొలగించి మరోసారి ఉపద్రవం రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
ఎడ తెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదలతో విజయవాడలో వరద నీరు పోటెత్తింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జల దిగ్బందంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో మరణించారు. వందలాది ఇళ్లు నీటి ముంపులో ఉండిపోయాయి. వేలాది మంది పునరావాస కేంద్రాలకు తరలించారు. దీంతో సహాయక చర్యలను చంద్రబాబు ప్రభుత్వం యుద్ద ప్రాతిపదిక చేపట్టింది.
వరదల సమయంలో సీఎం చంద్రబాబు పనితీరు అద్భుతంగా ఉందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలనూ సమన్వయం చేసి వరద బాధితులను ఆదుకున్న తీరుపై దేశవ్యాప్తంగా సీఎంపై ప్రశంసలు కురుస్తున్నాయని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
వరద బాధితులను ఆదుకోవడం ముఖ్యమంతి చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.