Home » Flood Victims
వరదలు, భారీ వర్షాలతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థలు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. వారం రోజులపాటు కురిసిన వర్షాలు ప్రజలకు నీడ లేకుండా చేశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో బుడమేరు పొంగి విజయవాడ వాసులను ముంచెత్తింది. ఇళ్లలోకి పెద్దఎత్తున నీరు చేరి దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. అయితే వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
: కొల్లేరు సరస్సులో ముంపు రోజురోజుకూ పెరుగుతూ గ్రామాలను చుట్టుముడుతోంది. ఎగువ నుండి భారీగా వరద సరస్సులోకి చేరడంతో అనేక గ్రామాలకు వెళ్లే రహదారులు మునిగాయి.
సంవత్సరాల తరబడి రెక్కల కష్టం కళ్ల ముందే బుడమేరు లాక్కెళ్లిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయత వారిది! తామైనా ప్రాణాలతో బయటపడతామో లేదోనని బిక్కుబిక్కుమంటూ వారంరోజులుగా గడుపుతున్నారు.
వరద భాదితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 1,57,50,000 విరాళాన్ని వీఐటీ విశ్వవిద్యాలయం అందజేసింది.
విజయవాడలో వరద బాధితులకు చేయూత నిచ్చేందుకు జనసేన ఎన్‌ఆర్‌ఐ, ఆమెరికా విభాగం ముందుకొచ్చింది.
బుడమేరుకు బెజవాడ దుఃఖదాయిని అని పేరు! ఇప్పుడు ఈ వాగును విజయవాడ శివారు ప్రాంతాల వారు పగమేరు అని కూడా పిలుస్తున్నారు! వరద తగ్గినట్టే తగ్గి.. ఇళ్లు బాగు చేసుకునేలోపే మళ్లీ బుడమేరు వారితో కన్నీరు పెట్టించింది.
విజయవాడలోని వరద బాధితులకు నిత్యావసర సరుకుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది.
వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సాయం అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. దాంతో కేంద్ర హోం శాఖ రంగంలోకి దిగింది. సహాయక చర్యల్లో పాల్గొంది. తెలుగు రాష్ట్రాలకు అందజేసిన వరద సాయం గురించి హోం శాఖ శుక్రవారం సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేసింది.
వరద బాధితుల కోసం ప్రత్యేక యాప్ తీసుకువస్తున్నట్లు సీఎం చంద్రబాబు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ యాప్ వివరాలను ఐటీ ప్రత్యేక బృందం వివరించింది.