Home » Flood Victims
Andhrapradesh: ఏపీలో వరదలు ఎంతటి ఉపద్రవాన్ని సృష్టించాయే అందరికీ తెలిసిందే. బెజవాడ వాసులను వరదలు ముంచెత్తాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో సర్వం కోల్పోయారు వరద బాధితులు. ఇప్పుడిప్పుడే వరద నుంచి విజయవాడ వాసులు కాస్త కోలుకుంటున్నారు. మరోవైపు భారీ వరదలతో అంతా కోల్పోయిన వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు.
నాయకుడి యొక్క గొప్పతనం, పనితనం విపత్తులు, కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తాయి. అంతా బాగున్నప్పుడు ఎవరైనా చేయగలరు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలిచి.. వారి కష్టాల్లో భాగస్వామ్యం..
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సం కారణంగా భారీ నష్టం వాటిల్లింది. వరద ప్రభావం క్రమంగా తగ్గుతుండటంతో జరిగిన నష్టం వెలుగు చూస్తోంది. ఏపీలో వరద నష్టం అంతకంతకూ పెరుగుతోంది. ప్రాథమిక అంచనా ప్రకారమే..
జగన్ ఐదేళ్ల పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలను రాజకీయ పండితులు పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ తన పద్ధతిని మార్చుకుని.. పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఎంతోమంది సూచించారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
విజయవాడ: ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి సమయంలోనూ ఆయన వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఖండ్రిక సమీపంలో నున్న - నూజివీడు రహదారి చుట్టుపక్కల ఇప్పటికీ వరద నీరు ఉంది.
ఏలేరు రిజర్వాయర్ కన్నెర్ర జేసింది. కాకినాడ జిల్లా పరిధిలోని ఏడు మండలాల్లో వరద ముంచెత్తింది. పిఠాపురం నియోజకవర్గంలో వరద ప్రభావంతో కొన్ని కాలనీలు నీటమునగగా, వేలాది ఎకరాల్లో పంట వరద పాలైంది.
కృష్ణా నది వరద పోటుపై ఉన్న సమయంలోనే ప్రకాశం బ్యారేజీని మూడు ఇనుప బోట్లు ‘కలిసికట్టు’గా ఢీకొట్టడం వెనుక భారీ కుట్ర దాగిఉందా? బ్యారేజీ గేట్లను దెబ్బతీసేందుకే... ఉద్దేశపూర్వకంగా బోట్లను అలా ‘వదిలేశారా?’ ఈ అనుమానాలను బలపరిచే అనేక అంశాలు బయటపడుతున్నాయి. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ...
ఒకవైపు గోదావరి నదికి వరదలు.. మరోవైపు భారీ వర్షాలతో కోనసీమ జిల్లాలో ప్రజా జీవనం స్తంభించిపోయింది. గోదావరి నదులు ప్రవహిస్తుండడంతో నదీ పరివాహక లంక గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోయి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఉపాధి కరువైన లంక గ్రామాల ప్రజలు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం కారణంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి ఎక్కువ వరదుల వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్‌కు వివరించానని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు గవర్నర్‌ను కలిశారు. వరదలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మూడు గంటల పాటు పర్యటించారు. భారీ వర్షం పడుతున్నా.. వరద నీటిలో ఆయన పర్యటించారు. భవానీపురం, సితార సెంటర్, చిట్టి నగర్, ఎర్రకట్ట, మ్యాంగో మార్కెట్, సింగ్ నగర్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు.