Home » Fire Accident
Andhrapradesh: అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాయలంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎస్, సీఎంవో, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు అధికారులతో సమీక్ష చేపట్టారు. అగ్నిప్రమాదంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం.
తాము ఏదైనా ప్రమాదంలో ఉన్నామని సంకేతాలు అందితే చాలు.. వెంటనే తమ ప్రాణాలు కాపాడుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారు. మిగతా వాళ్ల గురించి పట్టించుకోకుండా.. తాము సురక్షితంగా బయటపడ్డామా? లేదా?
ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ (NTTPS)లో ఇవాళ (మంగళవారం) అర్ధరాత్రి బాయిలర్ నుంచి మంటలు(Boiler Explosion) చెలరేగి గాయపడిన ఇద్దరు కార్మికులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ (Minister Vasamshetty Subhash), మాజీ మంత్రి దేవినేని ఉమా(Devineni Uma) పరామర్శించారు. అర్ధరాత్రి సమయంలో ఎన్టీటీపీఎస్ ఐదో దశలో బాయిలర్ ఆగిపోవడంతో కార్మికులు మరమ్మతులు చేపట్టారు. ఆ సమయంలో బూడిద నిల్వ తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. దీంతో మంటలు చేలరేగి ఓ ఉద్యోగి, మరో కాంట్రాక్టు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి.
వరస బాయిలర్ పేలుడు(Boiler Explosion) ఘటనలతో ఎన్టీఆర్ జిల్లా(NTR District) దద్దరిల్లుతోంది. జగ్గయ్యపేట మండలం బూదవాడ వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుడు ఘటన మరవకముందే ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam)లో మరో ప్రమాదం వెలుగు చూసింది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (NTTPS) ఐదవ యూనిట్ బాయిలర్‌లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి.
ఎన్టీఆర్ జిల్లా: బూధవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ వద్ద ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఆవాల వెంకటేశ్ (35) మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వారితో కలిసి మాట్లాడారు.
జిల్లాలోని జగ్గయ్యపేట మండలంలోని బూదవాడ (Budawada) లోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ (Ultratech cement factory)లో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు.
కుక్కలు తమ యజమానుల పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు.. జీవితాంతం వారి ఇంటికి కాపలాగా ఉంటాయి. వాటి ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ ...
ఉత్తరప్రదేశ్‌లోని నొయిడా సెక్టర్-32 లాజిక్స్ మాల్ (Logix Mall)లో బుధవారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 12 అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేయడంతో ప్రాణనష్టం తప్పింది.
సంచలనం సృష్టించిన వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ (Former MP Margani Bharat) ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో చిక్కుముడి వీడింది. నిందితుడు, వైసీపీ కార్యకర్త దంగేటి శివాజీని బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు.
Andhrapradesh: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున కొత్తహాలు వెనుక ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. శ్రీరామ్ చిట్ ఫండ్ కంపెనీ కార్యాలయంలో మొదటిగా మంటలు వ్యాపించాయి. అనంతరం దిగువ అంతస్థులో బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి మంటలు చెలరేగాయి.