Home » Fake Propaganda
నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు అరెస్టు అయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢీవీ ప్రాజెక్ట్స్ అనే సంస్థ పార్లమెంట్ భవన సముదాయంలోని ఎంపీల లాంజ్ నిర్మాణ పనులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ తరఫున కార్మికులుగా వచ్చిన ఖాసిమ్, మోనిస్, సోయబ్ నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు యత్నించి ఫ్లాప్ గేట్ వద్ద జరిగిన తనిఖీల్లో పట్టుబడ్డారు.
ఇది అసలే ఎన్నికల సమయం.. ఓట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారివి. ప్రజలను నమ్మించేందుకు అనేక మార్గాలు.. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఫేక్ ప్రచారం ఎక్కువైంది. ఏది సత్యమో.. ఏది అసత్యమో తెలుసుకునేలోపు అబద్ధం అందరినీ చేరుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వచ్చాక.. సాంకేతికతను ఉపయోగించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అది ఫేక్ అని గ్రహించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలకు అంతు లేకుండా పోయింది. ఫేక్ ప్రచారంలో అధికార వైసీపీ ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో విధంగా అసత్య ప్రచారాలతో ప్రజల మైండ్‌సెట్ మార్చాలనే ప్రయత్నంలో భాగంగా ఫేక్ పబ్లిసిటీకి వైసీపీ సోషల్ మీడియా విభాగం శ్రీకారం చుట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.