Home » Facebook
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచుగా రకరకాల వీడియోలను, ఫొటోలను షేర్ చేస్తూ తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. తాజాగా ఆమె ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్నాయి.
సాధారణంగా పాములు అప్పుడప్పుడు జనావాసాల్లోకి వచ్చేస్తుంటాయి. గ్రామాల్లో తరచుగా కనిపిస్తుంటాయి. అయితే కొండచిలువలు మాత్రం జనావాసాలకు దూరంగా అడవుల్లోనే నివసిస్తాయి. అయితే ఇటీవలి కాలంలో కొండ చిలువలు కూడా ఆహారం కోసం అటవీ సమీప గ్రామాల్లోకి చొరబడుతున్నాయి.
సాధారణంగా మనం బస్సుల్లోనూ, రైళ్లలోనే ప్రయాణిస్తున్నపుడు కొందరు వ్యక్తులు వచ్చి విరాళాలు అడుగుతుంటారు. తమ ఇంట్లో వాళ్లకు ఆరోగ్యం బాగా లేదనో, ఎక్కడో గుడి కడుతున్నామనో చెప్పి డబ్బులు అడుగుతుంటారు. అయితే విమానం ఎక్కి మరీ అలా అడిగే వాళ్లని ఎప్పుడైనా చూశారా?
అడవిలో పులిని మించిన వేటగాడు లేడనుకుంటాం. ఒక జంతువును చూసిన తర్వాత పులి వేటాడే పద్ధతి గురించి ఎన్నో వీడియోలు చూసి ఉంటాం. అయితే అంత గొప్ప వేటగాడిగా పేరు తెచ్చుకున్న పులి సక్సెస్ రేట్ కేవలం 5 శాతం మాత్రమేనట. అంటే 100 సార్లు తీవ్రంగా ప్రయత్నిస్తే కేవలం 5 సార్లు మాత్రమే పులికి ఆహారం దొరుకుతుంది.
అమెరికాలోని వర్జీనియాలోని ఓ కుటుంబానికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆ ఘటన ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉన్నట్టుండి ఇంటి సీలింగ్ కుప్పకూలిపోయింది.
ఇటీవలి కాలంలో పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ అవుతాయి. ఇళ్లల్లోకి వచ్చేస్తున్న పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా అప్‌లోడ్ అవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ భారీ నాగుపాము ఓ ఇంట్లో స్వేచ్చగా తిరుగుతోంది.
మన మూడ్ బాగోలేని సమయంలో ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు. ఎన్నో వందల వీడియోలు దర్శనమిస్తాయి. వాటిల్లో కొన్ని నవ్విస్తాయి. మరికొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. తెలియకుండానే ఎంతో సమయం గడిచిపోతుంది. ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాలిబన్లు ఆక్రమించుకున్నాక అఫ్గానిస్థాన్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. అఫ్గాన్ పౌరులపై ఎన్నో కఠిన ఆంక్షలు విధించి వారిని నియంత్రణలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది ఆడ పిల్లలను చదువుకు దూరం చేయడం. బాలికలు పాఠశాలలకు వెళ్లకుండా తాలిబన్లు నిషేధం విధించారు.
సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో పాములకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. భయంకరమైన కొండ చిలువలు, ఇంట్లోకి వచ్చేస్తున్న పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాటి వీడియో ఒకటి బయటకు వచ్చింది.
కొంత మంది యువకులకు అద్భుతమైన ట్యాలెంట్ ఉంటుంది. సినిమాల్లో చూపించే విధంగా కళ్లు చెదిరే రీతిలో స్టంట్లు చేయగలుగుతారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి వ్యక్తుల ప్రతిభ చాలా మందిని చేరుతోంది. వారు మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు.