Home » eye care
Night Vision Contact Lenses: చరిత్రలో ఇప్పటివరకూ ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేశారు శాస్త్రవేత్తలు. అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసి చూపించారు. తాజాగా సైంటిస్టులు అభివృద్ధి చేసిన 'సూపర్-విజన్' కాంటాక్ట్ లెన్స్ కూడా ఆ కోవలోకే వస్తుంది. దీని సాయంతో ఇకపై చీకట్లోనే కాదు. కళ్లు మూసుకున్నా ఏం చక్కా చూసేయచ్చు.
Eye Health Tips: కంటి చూపు తగ్గి కొందరు, స్మార్ట్ లుక్స్ కోసం మరికొందరు రోజూ కళ్లద్దాలు ధరిస్తుంటారు. అయితే, మీరెప్పుడైనా మీ కళ్లద్దాలపై చిన్న చిన్న గీతలు ఉన్నాయేమో అని చెక్ చేశారా.. లేకపోతే ఉన్నా చూసి చూడనట్టు వదిలేస్తున్నారా.. ఈ చిన్నపాటి నిర్లక్ష్యం ఎన్ని ప్రమాదాలు తెచ్చిపెడుతుందో తెలుసా..
Causes Of Eye Cancer: మనలో చాలామంది కంటి సమస్యలను పెద్దగా పట్టించుకోరు. చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ, మన శరీరంలో పంచేద్రియాలలో ఒకటైన కళ్లు లేకపోతే జీవితం అంధకారం అయిపోతుంది. కాబట్టి, ఇతర శరీర భాగాలతో పాటు కళ్లనూ కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ముఖ్యంగా ఈ లక్షణాలు ప్రాణాంతక క్యాన్సర్ వస్తుందని చెప్పే సంకేతాలు కావచ్చు.
Swimming Pools: ఎండాకాలం వచ్చిందంటే చాలు నగరాల్లోని చాలా మంది స్విమ్మింగ్ పూల్స్‌కు క్యూ కడుతుంటారు. గంటలు, గంటలు నీళ్లలోనే గడిపేస్తుంటారు. ఇలా చేయటం వల్ల కళ్లు ప్రమాదంలో పడతాయని డాక్టర్లు చెబుతున్నారు. కంటి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
క్యాన్సర్ కన్నెర్ర చేస్తోంది. పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా అన్ని వయసుల వారిలోనూ చూపును దెబ్బతీస్తోంది. కాలేయం, ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వారం, చర్మ సంబంధిత క్యాన్సర్లను మనం ఎక్కువగా చూస్తుంటాం.
ప్రపంచంలోనే అతిపెద్ద.. కళ్లద్దాల తయారీ పరిశ్రమ కార్యకలాపాలు అతి త్వరలోనే తెలంగాణలో ప్రారంభం కానున్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీదర్‌బాబు అన్నారు. ప్రముఖ కళ్లజోళ్ల బ్రాండ్ లెన్స్‌కార్ట్ ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమతో తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం కానుందని తెలిపారు.
అందాన్ని రెట్టింపు చేసే కాటుక కళ్ల వెనక ప్రమాదమూ దాగుంది. అందుకే రోజూ కాటుక పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్లు ఇది తప్పక తెలుసుకోవాలి. ఈ విషయంలో ఏమరుపాటుగా ఉంటే మీ కళ్లకు వచ్చే సమస్య నుంచి తప్పించుకోవడం కష్టం..
శీతాకాలంలో వీచే చలిగాలుల వల్ల కళ్లలో తేమ తగ్గిపోతుంటుంది. కళ్లు ఒత్తిడికి గురై పొడిబారుతుంటాయి. దీంతో కళ్లు ఎర్రగా మారి గుచ్చుకుంటున్నట్లుగా అనిపిస్తాయి. కళ్లు త్వరగా అలసిపోతాయి కూడా. వైద్యుల సలహా మేరకు కంటి చుక్కలు వాడడంతోపాటు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కళ్లు లేని జీవితం ముందుకు సాగలేదు. ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునేవి కళ్లు. మన ఆలోచనలు, ఆరోగ్యానికి ప్రతిబింబాలు కళ్లు... రంగుల ప్రపంచాన్ని చూస్తూ... కోటి కాంతులను పంచుతూ... కలలను పండించుకోవాల్సిన కళ్లకు కమ్ముకున్న కాలుష్యం, పోషకాహార లేమితో నిర్జీవంగా మారుతున్నాయి.
కంటి వ్యాధులను సకాలంలో కనిపెట్టే పరీక్షలు చవకలో అందుబాటులోకొచ్చినప్పుడే వాటిని అరికట్టడం సాధ్యపడుతుంది. ఆ దిశగా సరికొత్త పరిశోధనలకు