Home » EVM Machine
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల (AP Elections) సమయం దగ్గరపడింది. సమయం లేదు మిత్రమా అంటూ అభ్యర్థులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే దాన్ని సువర్ణావకాశం ములుచుకుని అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. ఇదలా ఉంచితే.. పోలింగ్ రోజు ఓటర్లకు లెక్కలేనన్ని అనుమానాలు వస్తుంటాయ్. అసలు ఓటు పడిందా..? లేదా..? ఒకవేళ ఓటు పడిందనుకో తాము వేసిన పార్టీకే పడిందా లేదా.. క్రాస్ అయ్యిందా..? ఇలా చాలా అనుమానాలే వస్తుంటాయ్. అయితే.. ఈవీఎంలో మనం ఎవరికి ఓటు వేశామో చూసుకోవచ్చు.