• Home » Etela rajender

Etela rajender

G. Kishan Reddy: సింగరేణిని ప్రైవేటీకరించం..

G. Kishan Reddy: సింగరేణిని ప్రైవేటీకరించం..

సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటుపరం చేస్తుందని ఎన్నికల్లో ఓట్ల కోసం బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ అసత్య ప్రచారం చేశారని, అదంతా ఆయన ఆడిన డ్రామా అని మండిపడ్డారు.

MP Eetala: మీ కాలుకు ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా..

MP Eetala: మీ కాలుకు ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా..

మల్కాజిగిరి ఎంపీ నియోజకవర్గ ప్రజలకు సేవచేయడానికి ఎల్లప్పుడు ముందుంటానని ఎంపీ ఈటల రాజేందర్‌(MP Etala Rajender) అన్నారు. బీజేపీ వనస్థలిపురం డివిజన్‌ అధ్యక్షుడు నూతి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్‌కు అభినందన కార్యక్రమాన్ని ఎఫ్‌సీఐ కాలనీలో నిర్వహించారు.

Hyderabad: తెలంగాణకు కీలక శాఖలు!

Hyderabad: తెలంగాణకు కీలక శాఖలు!

కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు రెండు కీలక పదవులు దక్కాయి. కేంద్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే బొగ్గు, గనుల శాఖను కిషన్‌రెడ్డికి కేటాయిస్తూ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతలను పరిరక్షించే హోంశాఖకు సహాయ మంత్రిగా బండి సంజయ్‌ని నియమించారు.

Hyderabad: రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఈటలకు?

Hyderabad: రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఈటలకు?

రాష్ట్ర బీజేపీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. రాష్ట్ర శాఖకు కొత్త సారథి నియామకం జరగబోతోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్‌కు రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Modi 3.0 Cabinet: తెలుగు రాష్ట్రాలకు ఆరేడు.. ఎవరెవరంటే..!?

Modi 3.0 Cabinet: తెలుగు రాష్ట్రాలకు ఆరేడు.. ఎవరెవరంటే..!?

కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో టీడీపీ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు ఉండవచ్చని తెలుస్తోంది. మంత్రి పదవులు వరించే అవకాశం ఉన్న వారిలో తెలుగుదేశం నుంచి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

FGG: 17 మంది ఎంపీల్లో 14 మందిపై కేసులు ..

FGG: 17 మంది ఎంపీల్లో 14 మందిపై కేసులు ..

రాష్ట్రం నుంచి కొత్తగా ఎన్నికైన 17 మంది ఎంపీల్లో 14 మంది(82ు)పై కేసులున్నాయని ‘ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎ్‌ఫజీజీ)’ తెలిపింది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై అత్యధికంగా 54 కేసులున్నాయని వెల్లడించింది.

Ramoji Rao: రామోజీరావు మృతికి ఈటల రాజేందర్ సంతాపం

Ramoji Rao: రామోజీరావు మృతికి ఈటల రాజేందర్ సంతాపం

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్యంతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. రామోజీరావు మృతిపై సీనియర్ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంతాపం వ్యక్తం చేశారు.

Delhi: తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు?

Delhi: తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు?

దేశంలో మూడోసారి ఎన్‌డీయే కూటమి అధికారం చేపట్టబోతోంది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు కొద్దిమంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపుపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది.

Kishan Reddy: బీఆర్‌ఎస్‌ కథ ముగిసింది..

Kishan Reddy: బీఆర్‌ఎస్‌ కథ ముగిసింది..

బీఆర్‌ఎస్‌ కథ ముగిసిందని, కాంగ్రె్‌సపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కిషన్‌ రెడ్డి తెలిపారు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారని అన్నారు.

TS News: కేంద్ర మంత్రి పదవులు ఎవరెవరికి?

TS News: కేంద్ర మంత్రి పదవులు ఎవరెవరికి?

రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్‌లో ఎవరెవరికి బెర్త్‌ లభించనుంది? మోదీ తన క్యాబినెట్‌లో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు? ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయం సాధించిన దృష్ట్యా, కేంద్ర క్యాబినెట్‌ కూర్పునకు సంబంధించి తెలంగాణ కోటాపై ఎలాంటి ప్రభావం పడనుంది? వంటి ప్రశ్నలపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి