Home » Etela rajender
తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్లు తమ అసంతృప్తిని వెళ్లిబుచ్చగా.. అదే బాటలో మరి కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈటల రాజేందర్ ప్రధాన అనుచరుడు.. బీజేపీ సీనియర్ నేత ఏనుగు రవీందర్‌రెడ్డి అదే కోవలో ఉన్నట్లు చర్చ నడుస్తోంది.
తెలంగాణలో బీజేపీ (BJP) అధికారంలోకి రావటం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Etala Rajender) స్పష్టం చేసారు. బీజేపీని ఎవరూ వీడరని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
తెలంగాణ బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయి మరీ సోషల్ వార్ నిర్వహిస్తోంది. నిజానికి తెలంగాణలో ప్రస్తుతం మూడు వర్గాలు ఉన్నాయి. వాటిలో రెండు వర్గాలు సోషల్ మీడియా వేదికగా వార్ జరుపుతున్నాయి. మూడో వర్గం మాత్రం సైలెంట్. సోషల్ మీడియాలో ఎవరికి వారే పోస్టులు పెడుతున్నారు. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మద్దతుగా బీజేపీ క్యాడర్ పోస్టులు పెడుతోంది. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించటాన్ని ఈ వర్గం తప్పు పడుతోంది.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. వారి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నానన్నారు.
బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీ (BJP) ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించడంపై హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) స్పందించారు.
అవును.. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం (BJP High Command) భారీగా మార్పులు, చేర్పులు చేసింది. ముఖ్యంగా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో గులాబీ బాస్ కేసీఆర్‌ను (CM KCR) మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకూడదని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చింది.
అవును.. గత కొన్నిరోజులుగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని అసంతృప్తితో రగిలిపోతున్న బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను (Etela Rajender) కీలక పదవి వరించినట్లే..! బీజేపీలో (BJP) చేరిన తర్వాత తమ అభిమాన నాయకుడికి పదవి రాలేదని.. ఎప్పుడెప్పుడు పదవి వరిస్తుందా..? అని అభిమానులు, అనుచరులు, కార్యకర్తల ఎదురుచూపులు ఫలించాయి.
తెలంగాణ బీజేపీలో (TS BJP) మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను (Bandi Sanjay) తొలగించిన ఆ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) నియమించింది.! మరోవైపు.. బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి అగ్రనాయకత్వం తీసుకుంటోంది..
అవును.. గత వారం, పదిరోజులుగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో ప్రసారమైన ప్రత్యేక కథనాలు అక్షరాలా నిజమయ్యాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తూ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా.. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కేంద్రం ఖరారు చేసింది..
ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈటలకు కీలక పదవి ఇస్తే.. స్వాగతిస్తానని తెలిపారు. ఈటలతో కలిసి పదేళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేశానన్నారు. ఆర్థికమంత్రిగా ఢిల్లీ వచ్చినప్పుడు ఈటల తన ఇంట్లోనే ఉండేవారని తెలిపారు.