Home » Etela rajender
ఈటల రాజేందర్.. నువ్వు బీజేపీ ఎంపీవా? బీఆర్‌ఎస్ నేతవా? అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిలదీశారు. గతంలో పీసీసీ చీఫ్‌గా చేసినా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఒక్కటే విధానంతో ఉన్నారని తెలిపారు.
ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఎమ్మెల్యేలు తమ పనితీరును సమీక్షించుకోవాలని హితవు పలికారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీలు నిర్మించాలన్న నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్, మంత్రివర్గం కలిసి తీసుకున్నదేనని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
Etela Inquiry: కాళేశ్వరం కమీషన్ ముందు 113వ సాక్షిగా మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా అంతా నిజమే చెబుతాను అంటూ ఈటెలతో ప్రమాణం చేయించిన అనంతరం కమిషన్ విచారణను షురూ చేసింది.
Mahesh Kumar Goud: కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని... వేల కోట్ల అవినీతి జరిగిందంటూ గతంలో ప్రధాని సహా పలువురు అనేక సార్లు ఆరోపణలు చేశారని మహేష్ కుమార్ గుర్తుచేశారు. కానీ ఈటెల అందుకు భిన్నంగా కమిషన్ ఎదుట ఇచ్చిన వివరణను చూస్తే కేసీఆర్‌తో కుమ్మక్కైనట్లు స్పష్టమైందని ఆరోపించారు.
Etela Rajender: 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా వాల్యూతో ఉన్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేశానన్నారు. తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమని చెప్పారు.
Eatela Kaleshwaram Inquiry: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవలపై న్యాయవిచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ముందు ఎంపీ ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు.
Kaleshwaram project: కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తిరిగి శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ఈటల రాజేందర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరు అవుతారు. అలాగే ఈ నెల 9న మాజీ మంత్రి హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరుకానున్నారు.
కాళేశ్వరంపై విచారణలో భాగంగా మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్‌ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శుక్రవారం క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ దోపిడీ, అవినీతి పార్టీలే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.