Home » Enforcement Directorate
Telangana: ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మొదలైంది. బుధవారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ మొదలవగా.. ఈడీ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ కవిత పిటిషన్ దాఖలు చేయగా.. గత రెండు రోజులుగా కోర్టులో విచారణ జరుగుతోంది. నిన్నటి (మంగళవారం) విచారణలో కవిత తరపున న్యాయవాది నితేష్ రానా... ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వినిపించారు.
Telangana: ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగగా.. కవిత తరపున న్యాయవాది నితేష్ రానా వాదనలు వినిపించగా... ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వినిపించారు. ఈడీ వాదనల అనంతరం ఈ కేసుపై విచారణను కోర్టు రేపటికి (బుధవారం) వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. రేపు మధ్యాహ్నం ఇరువురి వాదనలు రౌస్ అవెన్యూ కోర్టు విననుంది.
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీబీఐ అరెస్ట్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగియగా.. తీర్పున రిజర్వ్ చేసింది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు. ఆ వెంటనే ఈడీ కేసులో బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు మొదలవగా.. విచారణను కోర్టు రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. కవిత తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ చేసిన ఆరోపణలను ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తోసిపుచ్చారు.
బిట్ కాయిన్ కుంభకోణంతో ప్రమేయమున్న వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఆస్తులను ఈడీ గురువారం సీజ్ చేసింది. దాదాపు రూ. 100 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. ముంబై జూహులోని ఫ్లాట్‌తోపాటు పుణేలోని బంగ్లాను సైతం సీజ్ చేసిన వాటిలో ఉన్నాయి.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో(Tihar Jail) ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు(Kejriwal) సుప్రీంకోర్టులోనూ(Supreme Court) నిరాశే ఎదురైంది. కేజ్రీవాల్‌కు అత్యున్నత న్యాయస్థానంలోనూ ఊరట లభించలేదు. ఈడీ(ED) అరెస్ట్‌పై కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. ఈ అరెస్ట్ ఛాలెంజ్ పిటిషన్‌ను ఏప్రిల్ 29న విచారిస్తానని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ..
Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయగా.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జ్యుడీషియల్ కస్టడీ గడువు ఈరోజు ముగియడంతో తీహార్ జైలు నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత( BRS MLC K Kavitha) కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ED కోర్టును కోరింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi excise policy case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత(kavitha) జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కవితను కోర్టు ముందు అధికారులు హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో కవితకు మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరైట్ దూకుడు కొనసాగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ వైభవ్ కుమార్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ లను ఈడీ సోమవారంనాడు విచారించింది.