Home » Enforcement Directorate
ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగుస్తున్న వేళ.. కేరళలో అధికారంలో ఉన్న సీపీఐకు భారీ షాక్ తగిలింది. కేరళలో(Kerala) సీపీఎంకు చెందిన భూమి, బ్యాంకు డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) సీజ్ చేసింది.
ల్యాండ్ స్కాం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Soren)కు ఆ రాష్ట్ర హైకోర్టులో ఉపశమనం కలిగింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది.
విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖకు అపరిమిత అధికారాలు కట్టబెట్టాలంటూ ఆ శాఖ ఐజీ రఘురామిరెడ్డి ప్రభుత్వానికి రాసిన లేఖపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణను జూలై 8కి వాయిదా వేసింది.
మైనింగ్ పేరుతో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి(Gudem Mahipal Reddy) అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఉన్న ఎమ్మెల్యే ఇల్లు, ఆఫీసులపై మనీలాండరింగ్, హవాలా అనుమానాల నేపథ్యంలో ఈడీ(ED) ఏకకాలంలో సోదాలు జరిపిన విషయం విదితమే.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనకు బెయిల్ దొరికిందని ఆనందించేలోపే.. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు గురువారం..
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో బృందాలుగా విడిపోయి పటాన్‌చెరులోని ఆయన నివాసం, పట్టణంలోని శాంతినగర్‌లో ఉండే తమ్ముడు గూడెం మధుసూధన్‌రెడ్డి,
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు సీబీఐ శుక్రవారం రౌస్‌అవెన్యూ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది.
చదలవాడ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, ఒంగోలు సహా ఆ కంపెనీకి చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను చదలవాడ ఇన్ఫ్రా టెక్ మోసం చేసిందని అధికారులు తెలిపారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన కల్వకుంట్ల కవితపై మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 4 కింద చర్యలు తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రత్యేక కోర్టును కోరింది. ఆమె ఆస్తుల స్వాధీనానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. మద్యం కుంభకోణంలో మొత్తం రూ.1100 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని, ఇందులో కవిత పాత్ర రూ.292 కోట్ల మేరకు ఉందని తెలిపింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని న్యాయస్థానం మరోసారి పొడిగించింది. సోమవారం ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. తొలుత ఈడీ కేసులో విచారణ జరిగింది.